News May 19, 2024

మరింత పడిపోతున్న సాగర్ నీటిమట్టం

image

నాగార్జునసాగర్ జలాశయంలో నీటి నిల్వలు రోజురోజుకూ పడిపోతున్నాయి. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు గాను 504.80 అడుగులు, పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.0450 టీఎంసీలకు గాను 123.0112 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఇక
జలాశయానికి ఇన్ ఫ్లో నిల్ ఉండగా, అవుట్ ఫ్లో 800 క్యూసెక్కులు ఉంది. ఈసారి వర్షాలు సమృద్ధిగా కురిస్తేనే మనుగడ ఉంటుందని సాగర్ ఆయకట్టు కింద అన్నదాతలు చెబుతున్నారు.

Similar News

News December 15, 2025

చిట్యాల: రిగ్గింగ్ జరిగందంటూ ఎన్నికల కమిషనర్‌కు ఫిర్యాదు

image

చిట్యాల మండలం చిన్నకాపర్తి గ్రామపంచాయతీ ఎన్నికల కౌంటింగ్‌లో అవకతవకలు, పోలింగ్‌లో రిగ్గింగ్ జరిగిందని సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిన రుద్రారపు భిక్షపతి ఆరోపించారు. సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ కార్యాలయంలో సోమవారం ఫిర్యాదు చేశారు. తన గుర్తుపై ఓటేసిన బ్యాలెట్ పేపర్లు డ్రైనేజీలో పడేసి లెక్కింపులో అవకతవకలకు పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

News December 15, 2025

నల్గొండ: ముగిసిన ప్రచారం.. ఎల్లుండి భవిత్యం..!

image

నల్గొండ జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికలు దేవరకొండ డివిజన్‌లో జరగనున్నాయి. ఎన్నికల ప్రచారం ఈరోజు సాయంత్రం 5 గంటలతో ముగిసింది. డివిజన్‌లోని మొత్తం 9 మండలాల్లో 269 గ్రామ పంచాయతీలకు గాను ఇప్పటికే 42 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. ఈనెల 17న 227 పంచాయతీల్లో జరిగే పోలింగ్‌లో ఇదే సమయానికి బరిలో ఉన్న సర్పంచ్ అభ్యర్థుల భవిత్యం తేలనుంది. మొత్తం 2,81,321 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

News December 15, 2025

మర్రిగూడ: సాఫ్ట్‌వేర్ to సర్పంచ్

image

సొంతూరుకు సేవ చేయాలనే తపనతో మర్రిగూడకు చెందిన వీరమల్ల శిరీష అనే వివాహిత సాఫ్ట్ వేర్ ఉద్యోగాన్ని వదులుకొని సర్పంచ్‌గా ఎన్నికయింది. శిరీష ఎంటెక్ పూర్తి చేసి ప్రముఖ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా పనిచేస్తూ పంచాయతీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు.