News April 5, 2025

మ‌రింత మెరుగ్గా అన్న క్యాంటీన్ల నిర్వ‌హ‌ణ‌: క‌లెక్ట‌ర్

image

జిల్లాలోని మూడు అన్న క్యాంటీన్ల‌కు రాష్ట్ర‌స్థాయిలో మెరుగైన ర్యాంకులు ల‌భించ‌డం ప‌ట్ల అధికారుల‌ను క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ బిఆర్ అంబేడ్క‌ర్ శుక్రవారం అభినందించారు. వీటి నిర్వ‌హ‌ణ‌ను మ‌రింతగా మెరుగుప‌రిచి, ప్ర‌జ‌ల‌కు రుచిక‌రంగా, నాణ్య‌మైన భోజ‌నాన్ని, అల్పాహారాన్ని అందించేందుకు చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని తెలిపారు. జిల్లాలోని అన్ని అన్న‌ క్యాంటీన్లు ఈ ఘనత సాధించాలని ఆకాంక్షించారు.

Similar News

News November 4, 2025

VZM: రూ.55 కోట్లతో 109 చెరువుల అభివృద్ధి

image

విజయనగరం జిల్లాలో 109 చిన్నతరహా చెరువులను రూ.55 కోట్లతో అభివృద్ధి చేయనున్నట్లు కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి తెలిపారు. చెరువుల అభివృద్ధిపై నేడు సమావేశం నిర్వహించారు. ఆర్ఆర్ఆర్ పథకం క్రింద ఐదు నియోజకవర్గాల్లోని 19 మండలాల్లో ఈ చెరువులు అభివృద్ధి కానున్నాయని చెప్పారు. మొత్తం మూడు విడతల్లో అభివృద్ధి చేయాలని అనుమతులు రాగానే పనులు ప్రారంభించాలన్నారు.

News November 4, 2025

యువకుడికి మూడేళ్ల జైలు శిక్ష: విజయనగరం ఎస్పీ

image

జామి మండలం మాదవరాయమెట్ట గ్రామానికి చెందిన వంతల శివ (23)పై పోక్సో కేసులో నేరం రుజువై 3 సంవత్సరాల జైలు శిక్ష, రూ.4వేల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చిందని ఎస్పీ దామోదర్ తెలిపారు. బాధిత బాలికకు రూ.50వేల పరిహారం మంజూరు చేసిందన్నారు. కేసు దర్యాప్తు చేసి, నిందితుడిని శిక్షించడంలో జామి పోలీసుల కృషిని ఎస్పీ అభినందించారు. 2024లో బాలికపై అత్యాచారానికి పాల్పాడగా శిక్ష ఖరారైందని తెలిపారు.

News November 4, 2025

ప్రజా సమస్యలను శ్రద్ధగా విని పరిష్కరించండి: SP

image

ప్రజల సమస్యలను శ్రద్ధగా విని, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఎస్పీ ఎ.ఆర్. దామోదర్, ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 54 ఫిర్యాదులు స్వీకరించి, వాటిలో భూగాదాలు, కుటుంబ కలహాలు, మోసాలకు సంబంధించినవని తెలిపారు. ఫిర్యాదులపై తక్షణ స్పందనతో 7 రోజుల్లో పరిష్కారం కల్పించాలని సూచించారు.