News April 16, 2025
మరికల్లో నారాయణపేట జిల్లా ఎస్పీ తనిఖీ

పోలీసులు ప్రజల మన్ననలు పొందేలా విధులు నిర్వహించాలని నారాయణపేట జిల్లా ఎస్పీ యోగేశ్ గౌతమ్ సూచించారు. మంగళవారం మరికల్ పోలీస్ స్టేషన్ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ పరిసరాలను, సిబ్బంది ఉంటున్న గదులను పరిశీలించారు. స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు. పెండింగ్లో, దర్యాప్తులో ఉన్న కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. సీఐ, ఎస్ఐ పాల్గొన్నారు.
Similar News
News November 27, 2025
ఇండస్ట్రియల్ పాలసీపై అసత్య ప్రచారం: ఉత్తమ్

TG: ఇండస్ట్రియల్ పాలసీలో కుంభకోణానికి ఆస్కారమే లేదని మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి పేర్కొన్నారు. ‘హైదరాబాద్ని కాలుష్యరహితంగా మార్చేందుకు ఇండస్ట్రీలను ORR బయటకి పంపాలన్న డిమాండ్ ఉంది. ఇది మేం కొత్తగా తెచ్చిన పాలసీ కాదు. ప్రతిపక్షాలు కావాలనే ప్రభుత్వంపై బురద చల్లుతున్నాయి. BRS హయాంలోనూ దీనిపై చర్చ జరిగింది. విద్యుత్లో రూ.50 వేల కోట్లు కాదు రూ.50 వేల కుంభకోణం కూడా జరగలేదు’ అని తెలిపారు.
News November 27, 2025
జిల్లాలో 1.61 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ పూర్తి: జేసీ

ఖరీఫ్ సీజన్లో జిల్లాలో 4 లక్షల మెట్రిక్ టన్నుల వరి సేకరణ అంచనాగా నిర్ణయించినట్లు జాయింట్ కలెక్టర్ వై. మేఘా స్వరూప్ వెల్లడించారు. గురువారం నాటికి మొత్తం 34,737 కొనుగోలు కూపన్లు రైతులకు జారీ చేశామని తెలిపారు. జిల్లాలోని 18 మండలాల్లో ఏర్పాటు చేసిన 201 కొనుగోలు కేంద్రాల ద్వారా, ఇప్పటివరకు 21,794 మంది రైతుల నుంచి 1,61,611.920 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు పూర్తి చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
News November 27, 2025
నామినేషన్ ప్రక్రియ శాంతియుతంగా జరిగేలా చూడాలి: SP

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో పకడ్బందీ బందోబస్తు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ డివి శ్రీనివాసరావు తెలిపారు. హవేలిఘనపూర్ మండలంలో పంచాయతీ ఎన్నికల పురస్కరించుకొని ఎంపీడీవో కార్యాలయంలో నామినేషన్ల కేంద్రాలను ఆకస్మికంగా పరిశీలించారు. ఎన్నికల నియమావళిని కచ్చితంగా పాటించేందుకు, నామినేషన్ ప్రక్రియ పూర్తిగా నిష్పక్షపాతంగా శాంతియుతంగా జరిగేలా పనిచేయాలని సిబ్బందికి సూచించారు.


