News April 11, 2025
మరికల్: ఇంటిగ్రేటెడ్ మండల కాంప్లెక్స్ కార్యాలయాల తరలింపు ముహూర్తం ఫిక్స్

మరికల్ మండలంలోని తహశీల్దార్ కార్యాలయం, ఎంపీడీవో కార్యాలయాలతో పలు కార్యాలయాలను ఇంటిగ్రేటెడ్ మండల్ కాంప్లెక్స్‌కు శనివారం తరలించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించినట్లు తెలిసింది. సీఎం రేవంత్ రెడ్డి ఫిబ్రవరి 21న ప్రారంభించిన మండల కాంప్లెక్స్ ఇండికేటర్ కార్యాలయంలో నీటి సమస్య ఏర్పడడంతో కార్యాలయాల తరలింపు బ్రేక్ పడింది. ఇట్టి కార్యాలయాలల్లో శుక్రవారం నూతన బోరును వేసేందుకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.
Similar News
News March 14, 2026
పరీక్షలు పారదర్శకంగా జరగాలి: కలెక్టర్

టెన్త్ పరీక్షలు అత్యంత పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని అధికారులను కలెక్టర్ హైమావతి ఆదేశించారు. శనివారం రంగధాంపల్లి, రాజగోపాల్‌పేట ఉన్నత పాఠశాలల్లోని పరీక్ష కేంద్రాలను పరిశీలించారు. ఎస్ఎస్సీ-2026 బోర్డు మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని, పరీక్ష గదుల్లో ఎలాంటి పుస్తకాలు ఉండకూడదని స్పష్టం చేశారు. విద్యార్థులు ఇబ్బంది పడకుండా అన్ని వసతులు కల్పించాలని చీఫ్ సూపరింటెండెంట్‌కు సూచించారు.
News March 14, 2026
లోక్ అదాలత్‌లో 8,815 కేసుల పరిష్కారం: శ్రీదేవి

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లావ్యాప్తంగా శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో 8,815 కేసులు రాజీ మార్గంలో పరిష్కారమైనట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీదేవి తెలిపారు. వీటిలో 8,261 క్రిమినల్, 166 సివిల్, 147 వాహన బీమా, 94 చెక్ బౌన్స్ కేసులు ఉన్నాయి. లోక్ అదాలత్ ద్వారా కక్షిదారుల సమయం, ధనం ఆదా అవుతాయని ఆమె పేర్కొన్నారు. ఇందులో 111 ప్రీ-లిటిగేషన్ కేసులు కూడా పరిష్కారమయ్యాయి.
News March 14, 2026
నాగర్‌కర్నూల్: ప్రభుత్వంపై పోరాటం చేస్తాం: నాగం

రైతులకు సాగునీరు,తాగునీరు అందించేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలుతీసుకోవాలని మాజీమంత్రి నాగం జనార్దన్ రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో పెండింగ్‌లో ఉన్న సుమారు మూడు కిలోమీటర్ల పనులను పూర్తి చేయకుంటే తన వయస్సును కూడా లెక్కచేయకుండా ప్రాజెక్టుల దగ్గర పోరాటాలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.


