News March 9, 2025

మరికల్: ‘ఓపెన్ స్కూల్లో సద్వినియోగం చేసుకోవాలి’

image

ఓపెన్ స్కూల్లో విద్యార్థులు సద్వినియోగం చేయాలని, రెగ్యులర్ పదో తరగతి సర్టిఫికేట్‌తో సమానంగా ఓపెన్ స్కూల్ సర్టిఫికెట్ విలువ చేస్తుందని ఉమ్మడి జిల్లా కో-ఆర్డినేటర్ శివయ్య అన్నారు. మండల కేంద్రంలో నిర్వహిస్తున్న ఓపన్ స్కూల్లో ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. బడి మధ్యలో మానిన విద్యార్థులు, పాఠశాలకు వెళ్ళని విద్యార్థులకు చక్కటి అవకాశం అన్నారు. కరస్పాండెంట్ చెన్నారెడ్డి, ప్రిన్సిపాల్ జ్యోతి ఉన్నారు.

Similar News

News March 24, 2025

వరంగల్: నగర అభివృద్ధికి సహకరించండి: కమిషనర్

image

పన్నులు చెల్లించి నగర అభివృద్ధికి సహకరించాలని GWMC కమిషనర్ డాక్టర్ అశ్విని తానాజీ వాకడే ప్రజలను కోరారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. 2024-25 ఆర్థిక సంవత్సరపు పన్నులు చెల్లించడానికి 8 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయని, దీర్ఘకాలంగా పన్నులు చెల్లించని వారికి ఇప్పటికే రెడ్ నోటీసులు అందించి ఆస్తులను జప్తు చేస్తున్నామని హెచ్చరించారు.

News March 24, 2025

సొరంగం కూలిన 7 నిమిషాల్లోనే 8 మంది మృతి?

image

TG: ఫిబ్రవరి 22న SLBC సొరంగం కూలి 8 మంది చిక్కుకుపోయిన ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సొరంగం కూలిన 7 నిమిషాల్లోనే అందరూ మృతి చెందినట్లు అధికారులు అంచనాకు వచ్చారని, ఈ మేరకు నేడు CMతో జరిగే సమీక్షలో వెల్లడించనున్నట్లు సమాచారం. బురద వల్ల మృతదేహాలు కుళ్లిపోయి ఉంటాయని భావిస్తున్నారు. కాగా, 8మందిలో ఒకరి మృతదేహాన్ని వెలికితీసిన విషయం తెలిసిందే. మరోవైపు సొరంగంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

News March 24, 2025

కెరమెరి: కుక్కకాటు.. బాలుడి మృతి

image

కుక్కకాటుతో 4ఏళ్ల బాలుడి మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. కెరమెరికి చెందిన చౌహాన్ రుద్ర దాస్,సరోజ దంపతుల కుమారుడు రిషిని కొద్ది రోజుల కిందట కుక్క కరిచింది. అప్పుడు తల్లిదండ్రులు హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. ఇంటికొచ్చిన కొద్దిరోజులకు బాలుడిలో మళ్లీ రేబిస్ లక్షణాలు కనిపించాయి. దీంతో కాగజ్‌నగర్ ఆసుపత్రికి, అక్కడి నుంచి మంచిర్యాలకు తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు.

error: Content is protected !!