News February 27, 2025
మరికల్: గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

మరికల్ మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందిన ఘటన గురువారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాలిలా.. పసుపులకి చెందిన కృష్ణయ్యను గూరకొండ దగ్గర బుధవారం రాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు మహబూబ్నగర్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ విషయమై కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర పోలీస్ స్టేషన్లో పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News February 28, 2025
ఎడపల్లి: గేదెలను కడగడానికి వెళ్లి వ్యక్తి మృతి

ఎడపల్లి పులి చెరువులో గురువారం సాలూర మండల కేంద్రానికి చెందిన మంగలి రమేశ్(35) గేదెలను కడగడానికి చెరువు వద్దకు వెళ్లారు. ప్రమాదవశాత్తు అందులో పడి మృతి చెందాడు. ఈ ఘటనపై మృతుడి తండ్రి లక్ష్మణ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎడపల్లి ఎస్ఐ వంశీకృష్ణారెడ్డి తెలిపారు.
News February 28, 2025
చిట్యాల: కుటుంబ సమస్యలతో ఉరేసుకొని వ్యక్తి మృతి

చిట్యాల మండలం కాల్వపల్లి గ్రామానికి చెందిన సతీశ్ ఉరేసుకొని మృతిచెందారు. పోలీసుల కథనం ప్రకారం.. సతీశ్ కొంతకాలంగా మద్యానికి బానిసై భార్యతో గొడవ పడుతున్నాడు. దీంతో ఆమె పుట్టింట్లోనే ఉంటోందిజ ఈ క్రమంలో మద్యం తాగి ఉరేసుకొని చనిపోయాడు. భార్య కాపురానికి రావట్లేదని మనస్థాపంతో ఉరేసుకొని చనిపోయాడని మృతుడి తండ్రి కిట్టయ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రావణ్ కుమార్ తెలిపారు.
News February 28, 2025
CT: మరో సంచలనమా?.. దాసోహమా?

మొన్న ENGను చిత్తు చేసిన అఫ్గాన్ ఇవాళ AUSతో పోరుకు సిద్ధమవుతోంది. మ.2.30 గంటలకు ఇరు జట్ల మధ్య కీలక మ్యాచ్ జరగనుంది. ఇందులో గెలిచిన జట్టు సెమీస్ చేరనుండగా ఓడిన టీమ్ ఇంటిబాట పట్టనుంది. ENGను ఓడించి ఊపులో ఉన్న AFG.. AUSను కూడా కొట్టాలని ఉవ్విళ్లూరుతోంది. కానీ అది అంత ఈజీ కాదు. ICC టోర్నీలంటే రెచ్చిపోయే AUS.. AFGపై విరుచుకుపడే అవకాశం ఉంది. మరి మరో సంచలనం నమోదవుతుందో? AUSకు AFG దాసోహం అవుతుందో?