News January 25, 2025
మరికల్: చిత్రలేఖనం పోటీలో మరికల్ విద్యార్థి ప్రతిభ

నారాయణపేటలో నిర్వహించిన జాతీయ ఓటరు దినోత్సవ జిల్లా స్థాయి చిత్రలేఖనం పోటీల్లో మరికల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని ఆకాంక్ష ద్వితీయ స్థానంలో నిలిచారని పాఠశాల హెచ్ఎం నాగరత్నమ్మ తెలిపారు. ఈ సందర్భంగా ఆకాంక్షను ఉపాధ్యాయ బృందం అభినందించారు. జిల్లా స్థాయి పోటీల్లో మరికల్ విద్యార్థి ప్రతిభ చూపడం పట్ల పలువురు అభినందించారు.
Similar News
News November 4, 2025
PDPL: వసతుల కల్పనలో వేగం పెంచాలి: కలెక్టర్

పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల వద్ద తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్య పనులను వేగంగా పూర్తిచేయాలని సూచించారు. మంథని, సుల్తానాబాద్, గోదావరిఖని, ఓదెల, ధర్మారం, శ్రీరాంపూర్‌లో పనులు డిసెంబర్ 15 నాటికి, రామగుండం నగరంలో పనులు డిసెంబర్ చివరి నాటికి పూర్తికావాలని అధికారులను ఆదేశించారు. అసంపూర్ణ ఇళ్లు లబ్ధిదారులకు అలాట్ చేసేందుకు కూడా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా సూచించారు.
News November 4, 2025
ద్వారపూడిలో బైక్-ఆటో ఢీ.. వ్యక్తి మృతి

ద్వారపూడి శివారు వేములపల్లిలో మంగళవారం బైక్, ఆటో ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇప్పనపాడుకు చెందిన ఇందల దుర్గా సూరిబాబు (28) అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు.. సూరిబాబు స్నేహితుడి రాజుతో కలిసి బైక్‌పై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. తలకు గాయాలు కావడంతో సూరిబాబు మరణించాడు. రాజుకి గాయాలయ్యాయి. మృతదేహాన్ని మండపేట ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News November 4, 2025
JNTUHలో నిరసనలు, బంద్‌లు నిషేధం

JNTUHలో బంద్‌లు, నిరసనల పేరుతో విద్యా కార్యక్రమాలకు అంతరాయం కలిగించడం పూర్తిగా నిషేధించడమైనది ప్రిన్సిపల్ జి.వి నర్సింహ రెడ్డి ప్రకటించారు. విద్యార్థులు తమ చదువులపై దృష్టి పెట్టాలని, అప్రయోజక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు. ప్రతిష్ఠను దెబ్బతీసే, విద్యా కార్యక్రమాలకు ఆటంకం కలిగించే చర్యలకు పాల్పడితే కఠిన క్రమశిక్షణా చర్యలు తప్పవని హెచ్చరించారు.


