News February 3, 2025
మరికల్: చిరుత సంచారం నిజమే..!

NRPT జిల్లా మరికల్ మండలం పూసల్ పాడ్ లో సంజీవ కొండపై చిరుత సంచరిస్తున్నట్లు అటవీశాఖ బీట్ అధికారి మల్లేష్ ధ్రువీకరించారు. గతేడాది డిసెంబర్ ఒకటో తేదీన కొండపై చిరుత సంచరించిన వీడియోలు ఉన్నాయని, గ్యాప్ తర్వాత పశువులపై దాడి చేసినట్టు ఆయన నిర్ధారించారు. చిరుత సంచారంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, దానికి ఎలాంటి హాని కలిగించొద్దని రైతులను హెచ్చరించారు. చిరుత సంచారంతో ప్రజల్లో భయందోళన కలుగుతుంది.
Similar News
News February 13, 2025
HYD: ప్రజలను తప్పుదోవ పట్టించవద్దు: హైడ్రా

HYDలో ఎక్కడ కూల్చివేతలు జరిగినా వాటిని హైడ్రాకు ముడిపెట్టవద్దని హైడ్రా విజ్ఞప్తి చేసింది. బుధవారం మూసీలో జరిగిన కూల్చివేతలు హైడ్రా జరపలేదని స్పష్టం చేసింది. కూల్చివేతలతో హైడ్రాకు సంబంధం లేదని, ప్రజలను తప్పుదోవ పట్టించవద్దని కోరింది. గతంలో పలుమార్లు ఈ విషయాన్ని స్పష్టం చేసిన విషయాన్ని గుర్తు చేసింది.
News February 13, 2025
తూ.గో: ఈనెల 14న బహిరంగ వేలం

వివిధ ఘటనలో సీజ్ చేసిన 47,274 టన్నుల పీడీఎస్ బియ్యాన్ని ఈనెల 14న గోపాలపురంలోని ఎంఎల్ఎస్ పాయింట్ వద్ద బహిరంగ వేలం వేయనున్నట్లు JC చిన్నరాముడు ఒక ప్రకటనలో చెప్పారు. అదే రోజున దేవరపల్లిలో వెంకటేశ్వర రైస్ మిల్ వద్ద కూడా 16.00 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని వేలం వేయనున్నట్లు చెప్పారు. వేలంలో పాల్గొనే వారు ముందుగా రూ.5 వేలు ధరావత్తు చెల్లించాలన్నారు. కిలో బియ్యం రూ.22కి నిర్ణయించామన్నారు.
News February 13, 2025
వీరఘట్టం: అనారోగ్య సమస్యలతో ఆత్మహత్య

అనారోగ్య సమస్యలు తాళలేక ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన వీరఘట్టంలో జరిగింది. పోలీసుల వివరాలు.. గ్రామానికి చెందిన లక్ష్మణరావు(38) కొన్నేళ్లుగా కాలేయ వ్యాధితో బాధ పడుతున్నాడు. ఈ క్రమంలో గడ్డిమందు తాగాడు. గుర్తించిన భార్య చోడవరపుదేవి స్థానిక ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుంచి శ్రీకాకుళం రిమ్స్ తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మరణించాడు.