News February 3, 2025
మరికల్: చిరుత సంచారం నిజమే..!

NRPT జిల్లా మరికల్ మండలం పూసల్ పాడ్ లో సంజీవ కొండపై <<15345332>>చిరుత<<>> సంచరిస్తున్నట్లు అటవీశాఖ బీట్ అధికారి మల్లేశ్ ధ్రువీకరించారు. గతేడాది డిసెంబర్ ఒకటో తేదీన కొండపై చిరుత సంచరించిన వీడియోలు ఉన్నాయని, గ్యాప్ తర్వాత పశువులపై దాడి చేసినట్టు ఆయన నిర్ధారించారు. చిరుత సంచారంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, దానికి ఎలాంటి హాని కలిగించొద్దని రైతులను హెచ్చరించారు. చిరుత సంచారంతో ప్రజల్లో భయందోళన కలుగుతుంది.
Similar News
News November 24, 2025
‘మాక్ అసెంబ్లీ’ ఎంపికలో గందరగోళం

మాక్ అసెంబ్లీకి విద్యార్థుల ఎంపికపై వివాదం నెలకొంది. ఆదోని నెహ్రూ మెమోరియల్ పాఠశాల విద్యార్థి వంశిత తనకు అన్యాయం జరిగిందని వాపోయారు. తాను తొలి స్థానంలో నిలవగా రెండో స్థానం విద్యార్థిని అసెంబ్లీకి సెలెక్ట్ చేశారని మంత్రి లోకేశ్కు ఫిర్యాదు చేశారు. అలాగే ఆళ్లగడ్డ మాక్ ఎమ్మెల్యేగా తొలుత తనను ఎంపిక చేసి చివరకు 3వ స్థానంలో నిలిచిన విద్యార్థిని సెలెక్ట్ చేశారని విద్యార్థిని మోక్షిత ఆవేదన వ్యక్తం చేశారు.
News November 24, 2025
వరంగల్ భద్రకాళి దేవస్థానంలో భక్తుల ఆగ్రహం!

వరంగల్ శ్రీ భద్రకాళి దేవస్థానంలో కొలువై ఉన్న వల్లభ గణేశుడి ఆలయాన్ని సమయానికి తెరవకపోవడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం 7 గంటలు దాటినా ఆలయం తలుపులు తెరుచుకోకపోవడంతో, గణేశుడిని దర్శించుకోవడానికి చేరుకున్న భక్తులు అసంతృప్తి వెలిబుచ్చారు. ప్రతి రోజూ నిర్దిష్ట సమయానికి పూజలు ప్రారంభమవుతుండగా, ఈరోజు ఆలస్యానికి స్పష్టమైన కారణం తెలియకపోవడంతో భక్తుల్లో గందరగోళం నెలకొంది.
News November 24, 2025
సీ క్లే గురించి తెలుసా?

ప్రస్తుతం చాలామంది అమ్మాయిలు క్లే మాస్కులు వాడటానికే మొగ్గు చూపుతున్నారు. వీటితో ఎన్నో ప్రయోజనాలున్నాయంటున్నారు నిపుణులు. వాటిల్లో ఒకటి సీ క్లే. దీన్నే ఫ్రెంచ్ గ్రీన్ క్లే అని పిలుస్తారు. ఆకుపచ్చ రంగులో ఉండే దీంట్లో ఐరన్ ఆక్సైడ్స్, మెగ్నీషియం, కాల్షియం, కాపర్ వంటి మినరల్స్ కూడా అందుతాయి. మొటిమలు, మచ్చల్ని దూరం చేస్తుంది. ఆయిల్, సెన్సిటివ్ స్కిన్ వారికి ఈ మాస్క్ బాగా పనిచేస్తుంది.


