News February 3, 2025

మరికల్: చిరుత సంచారం నిజమే..!

image

NRPT జిల్లా మరికల్ మండలం పూసల్ పాడ్ లో సంజీవ కొండపై <<15345332>>చిరుత<<>> సంచరిస్తున్నట్లు అటవీశాఖ బీట్ అధికారి మల్లేశ్ ధ్రువీకరించారు. గతేడాది డిసెంబర్ ఒకటో తేదీన కొండపై చిరుత సంచరించిన వీడియోలు ఉన్నాయని, గ్యాప్ తర్వాత పశువులపై దాడి చేసినట్టు ఆయన నిర్ధారించారు. చిరుత సంచారంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, దానికి ఎలాంటి హాని కలిగించొద్దని రైతులను హెచ్చరించారు. చిరుత సంచారంతో ప్రజల్లో భయందోళన కలుగుతుంది.

Similar News

News February 12, 2026

చిత్తూరు: పరీక్షల్లో అధికారుల ఫెయిల్.. 19మందిపై చర్యలు

image

రెవెన్యూ శాఖలో తాత్కాలిక షరతులతో సీనియర్ అసిస్టెంట్లుగా ఇటీవల ప్రమోషన్ వచ్చింది. శాఖాపరమైన పరీక్షల్లో పాస్ కాకపోవడంతో ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని 19 మందిని తిరిగి గ్రేడ్-1 వీఆర్వోలుగా రివర్షన్ చేస్తూ కలెక్టర్ సుమిత్ కుమార్ ఉత్తర్వులు ఇచ్చారు. వీరు శాఖపరమైన పరీక్షల్లో అనుకున్న మేర ఫలితాలు సాధించకపోవడంతో రివర్షన్ ఇచ్చినట్టు అందులో పేర్కొన్నారు.

News February 12, 2026

మెదక్ జిల్లాలో 4 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు

image

మెదక్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌కు సర్వం సిద్ధమైంది. జిల్లాలోని 4 మున్సిపాలిటీలకు వేర్వేరుగా లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. మెదక్‌లో గోల్డ్ బంగ్లా వెస్లీ కళాశాల, నర్సాపూర్‌లో BVRIT, తూప్రాన్‌లో నోబుల్ ఫార్మా కళాశాల, రామాయంపేటలో ఎంపీడీవో కార్యాలయంలో ఓట్ల లెక్కింపు జరగనుంది. రేపు ఉదయం నుండే ఈ ప్రక్రియ ప్రారంభం కానుండటంతో ఏర్పాట్లు పూర్తి చేశారు.

News February 12, 2026

నందిపేట్: ఇద్దరి మృతి.. రెండు కుటుంబాల్లో విషాదం

image

నందిపేట్ మండలం చౌడమ్మ కొండూరుశివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన శివ (28) బుధవారం చికిత్స పొందుతూ మృతిచెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. ఈనెల 2న నందిపేట్–కొండూరు మార్గంలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటనలో కొడుపల సాగర్ (30) చికిత్స పొందుతూ మృతి చెందగా.. తీవ్రంగా గాయపడిన శివ కూడా బుధవారం మృతి చెందాడు. ఒకే ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది.