News February 3, 2025
మరికల్: చిరుత సంచారం నిజమే..!

NRPT జిల్లా మరికల్ మండలం పూసల్ పాడ్ లో సంజీవ కొండపై <<15345332>>చిరుత<<>> సంచరిస్తున్నట్లు అటవీశాఖ బీట్ అధికారి మల్లేశ్ ధ్రువీకరించారు. గతేడాది డిసెంబర్ ఒకటో తేదీన కొండపై చిరుత సంచరించిన వీడియోలు ఉన్నాయని, గ్యాప్ తర్వాత పశువులపై దాడి చేసినట్టు ఆయన నిర్ధారించారు. చిరుత సంచారంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, దానికి ఎలాంటి హాని కలిగించొద్దని రైతులను హెచ్చరించారు. చిరుత సంచారంతో ప్రజల్లో భయందోళన కలుగుతుంది.
Similar News
News January 22, 2026
వరంగల్: మిర్చి ‘ఘాటు’.. క్వింటా రూ. 29 వేలు!

ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో మిర్చి ధరలు రికార్డు సృష్టిస్తున్నాయి. గురువారం జరిగిన వేలంలో యూఎస్ 341 రకం మిర్చి క్వింటాకు ఏకంగా రూ. 29 వేల అత్యధిక ధర పలికింది. గత సోమవారం రూ. 20 వేలుగా ఉన్న ధర, నాలుగు రోజుల్లోనే రూ.9 వేలు పెరగడం విశేషం. ఉమ్మడి జిల్లాలో దిగుబడులు తగ్గడం, అంతర్జాతీయంగా ఎగుమతులకు డిమాండ్ పెరగడమే ఈ ధరల పెరుగుదలకు కారణమని వ్యాపార వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
News January 22, 2026
టెన్త్, ఐటీఐతో 210 పోస్టులు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో 210 వర్క్‌మెన్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. టెన్త్, ITI, నేషనల్ అప్రెంటిస్‌షిప్ సర్టిఫికెట్‌తో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. రాత పరీక్ష, ప్రాక్టికల్ టెస్ట్, జనరల్, ట్రేడ్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: cochinshipyard.in/ *మరిన్ని ఉద్యోగాల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.
News January 22, 2026
వరంగల్ మార్కెటింగ్ ఆర్జేడీ శ్రీనివాస్ బదిలీ

వరంగల్ మార్కెటింగ్ శాఖ రీజియన్ జాయింట్ డైరెక్టర్ ఉప్పుల శ్రీనివాస్ బదిలీ అయ్యారు. ఆయనను హైదరాబాద్‌లోని వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయానికి బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన స్థానంలో ప్రస్తుతం అదనపు డైరెక్టర్‌గా విధుల్లో ఉన్న ఆర్. లక్ష్మణుడుకు వరంగల్ ఆర్జేడీగా అదనపు బాధ్యతలు అప్పగించారు.


