News March 9, 2025
మరికల్: భారత్ విజయంతో మిఠాయిల పంపిణీ

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో న్యూజిలాండ్పై భారత్ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించడం పట్ల ఆదివారం మరికల్ మండల కేంద్రంలో యువకులు మిఠాయిలు పంపిణీ చేస్తూ సంబరాలు చేసుకున్నారు. ట్రోఫీ భారత్కు రావడంతో భారత్ మాతాకీ జై అని నినాదాలు చేస్తూ విజయోత్సవ సంబరాలను నిర్వహించారు.
Similar News
News December 16, 2025
నెహ్రూ జూ పార్క్లో AI కమాండ్ కంట్రోల్ సెంటర్

నెహ్రూ జూ పార్క్ చరిత్రలో ఒక అద్భుతం జరగబోతోంది. త్వరలో AI కమాండ్ కంట్రోల్ సెంటర్ను ఏర్పాటు చేస్తున్నారు. అడవి బిడ్డల రక్షణలో ఇది సరికొత్త రికార్డు సృష్టించనుంది. AI సాయంతో జంతువుల ప్రతి కదలికను, వాటి ఆరోగ్యాన్ని 24/7 పర్యవేక్షించవచ్చు. ఏదైనా చిన్న మార్పు వచ్చినా ఈ స్మార్ట్ సెంటర్ వెంటనే హెచ్చరిస్తుంది. ప్రైవేట్ సౌండ్-ప్రూఫ్ టెక్నాలజీతో ఈ కేంద్రాన్ని నిర్మించడం విశేషం.
News December 16, 2025
అన్నమయ్య జిల్లాలో 49.160 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ: JC

అన్నమయ్య జిల్లాలో ఖరిఫ్ 2025–26 సీజన్లో ఇప్పటివరకు 49.160 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించామని జిల్లా సంయుక్త కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ తెలిపారు. జిల్లాలో 45 ధాన్యం సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేశామని 15 మంది రైతులకు రూ.11.74 లక్షలు 24 గంటల్లోనే చెల్లించినట్లు వెల్లడించారు. రైతులు దళారులను ఆశ్రయించకుండా ప్రభుత్వ సేకరణ కేంద్రాలను వినియోగించుకోవాలని సూచించారు.
News December 16, 2025
పోచంపల్లి: నాడు క్లాస్మేట్స్, నేడు సర్పంచులు

నిరుపేద కుటుంబాల్లో జన్మించి పోచంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యను ఆభ్యసించి ఇద్దరు విద్యార్థులు నేడు రెండు గ్రామపంచాయతీల సర్పంచులయ్యారు. పోచంపల్లి మున్సిపల్ కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 2009-10 బ్యాచుకు చెందిన ధీరావత్ వెంకటేష్ నాయక్ ఇంద్రియాల గ్రామ సర్పంచ్గా గెలుపొందాడు. శాపాక లింగస్వామి జలాల్పూర్ సర్పంచిగా గెలుపొందాడు.


