News March 9, 2025
మరికల్: భారత్ విజయంతో మిఠాయిల పంపిణీ

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో న్యూజిలాండ్‌పై భారత్ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించడం పట్ల ఆదివారం మరికల్ మండల కేంద్రంలో యువకులు మిఠాయిలు పంపిణీ చేస్తూ సంబరాలు చేసుకున్నారు. ట్రోఫీ భారత్‌కు రావడంతో భారత్ మాతాకీ జై అని నినాదాలు చేస్తూ విజయోత్సవ సంబరాలను నిర్వహించారు.
Similar News
News March 19, 2025
వనపర్తి: కాంగ్రెస్ ఇచ్చిన మాటను నిలబెట్టుకుంది: రాజేంద్రప్రసాద్

కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42 శాతం రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణ బిల్లును ఆమోదించి బీసీ ఎస్సీ వర్గాలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నదని వనపర్తి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ యాదవ్ అన్నారు. కాంగ్రెస్ జిల్లా ఆఫీసులో మాట్లాడుతూ.. ఎన్నికల ముందు కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ బీసీలకు న్యాయం కోసం కులగణనను చేపడతామన్నారని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సీఎం రేవంత్ రెడ్డి దాన్ని అమలు చేశారన్నారు.
News March 19, 2025
మెదక్: యువకుడి సూసైడ్

ఉరివేసుకుని యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన నిజాంపేట మండలంలో జరిగింది. వివరాలు.. మండల కేంద్రానికి చెందిన గరుగుల భాను(19) మంగళవారం రాత్రి ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకున్నాడు. వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించడంతో దుబ్బాక ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలోనే మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News March 19, 2025
సంగారెడ్డి: పాఠశాలలపై చర్యలు: డీఈవో

జిల్లాలో ఈనెల 15 నుంచి ప్రారంభమైన హాఫ్‌డే స్కూల్స్ నడుపని పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ.. జిల్లాలో కొన్ని ప్రైవేటు పాఠశాలల ఒంటి పూట బడులు నడపడం లేదని, పూర్తి రోజు పాఠశాలలను నడిపిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ఇలాంటి పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.