News January 28, 2025
మరికల్: వేధింపుల కేసులో వ్యక్తికి జైలు శిక్ష

మరికల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ అమ్మాయిని కొట్టి వేధించిన కేసులో కన్మనూరుకి చెందిన చింటూ అనే యువకుడికి 7 సంవత్సరాల జైలు శిక్ష, రూ. 20,200 జరిమానా విధిస్తూ జడ్జి వింధ్య నాయక్ మంగళవారం తీర్పు వెల్లడించినట్లు ఎస్పీ యోగేష్ గౌతమ్ తెలిపారు. 2017 సెప్టెంబర్ 13న అమ్మాయి తండ్రి తిమ్మప్ప ఇచ్చిన ఫిర్యాదు కేసు నమోదు చేశామని, దర్యాప్తు చేసి సాక్ష్యాలు కోర్టుకు సమర్పించడంతో జైలు శిక్ష విధించిందని చెప్పారు.
Similar News
News October 26, 2025
ఎన్టీఆర్ జిల్లాలో విద్యాసంస్థలకు సెలవులు

మొంథా తుఫాన్ కారణంగా ఈ నెల 27, 28, 29 తేదీలలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలకు సెలవు ప్రకటిస్తున్నట్లు కలెక్టర్ జి. లక్ష్మీశ తెలిపారు. వసతి గృహాల విద్యార్థులు ఆదివారం సాయంత్రంలోగా ఇళ్లకు వెళ్లేలా అధికారులు పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదేశించారు.
News October 25, 2025
స్లీప్ బ్యాంకింగ్.. నిద్రను దాచుకోండి!

పని లేనప్పుడు ఎక్కువ గంటలు నిద్రపోవడం, పని ఉన్నప్పుడు తక్కువ గంటలు నిద్రపోవడాన్నే ‘స్లీప్ బ్యాంకింగ్’ అంటారు. ఉదాహరణకు ఫలానా రోజు మీకు ఆఫీస్ అవర్స్ ఎక్కువ ఉన్నట్లు తెలిస్తే 3-7 రోజుల ముందే నిత్యం 2-3 గంటలు అధికంగా నిద్రపోవాలి. దీంతో వర్క్ అధికంగా ఉన్నా నిద్రకు ఎలాంటి ఇబ్బంది కలగదని అధ్యయనంలో తేలింది. అలాగే పసిపిల్లల తల్లులు కూడా సమయం దొరికినప్పుడు ఒక న్యాప్ వేస్తేనే అలసట దరిచేరదట.
News October 25, 2025
మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లకండి: కలెక్టర్

తుఫాన్ కారణంగా ఈ నెల 27 నుంచి 29వ తేదీ వరకు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున మత్స్యకారులు ఎవరూ సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని కలెక్టర్ డీకే బాలాజీ కోరారు. ఇప్పటికే సముద్రంలో వేటకు వెళ్లిన వారు ఆదివారం సాయంత్రంలోగా తిరిగి ఇంటికి చేరుకునేలా చర్యలు తీసుకోవాలని మత్స్య శాఖాధికారులను కోరారు.


