News January 28, 2025
మరికల్: వేధింపుల కేసులో వ్యక్తికి జైలు శిక్ష

మరికల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ అమ్మాయిని కొట్టి వేధించిన కేసులో కన్మనూరుకి చెందిన చింటూ అనే యువకుడికి 7 సంవత్సరాల జైలు శిక్ష, రూ. 20,200 జరిమానా విధిస్తూ జడ్జి వింధ్య నాయక్ మంగళవారం తీర్పు వెల్లడించినట్లు ఎస్పీ యోగేష్ గౌతమ్ తెలిపారు. 2017 సెప్టెంబర్ 13న అమ్మాయి తండ్రి తిమ్మప్ప ఇచ్చిన ఫిర్యాదు కేసు నమోదు చేశామని, దర్యాప్తు చేసి సాక్ష్యాలు కోర్టుకు సమర్పించడంతో జైలు శిక్ష విధించిందని చెప్పారు.
Similar News
News February 14, 2025
పెద్దపల్లి: ముస్లింల సంక్షేమానికి కృషి చేస్తా: ఎమ్మెల్యే

ముస్లింల సంక్షేమానికి కృషి చేస్తానని, వారికి ఇచ్చిన మాట ప్రకారం భూమి కేటాయించామని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు. ఈ సందర్భంగా గురువారం పెద్దపల్లి పట్టణంలో ఫారన్ మసీదులో ముస్లింలు నిర్వహించిన సమావేశానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. రాఘవపూర్ గ్రామ శివారులో ఇచ్చిన మాట ప్రకారం కబ్రస్థాన్ నిర్మాణానికి రెండు ఎకరాల భూమి కేటాయించామని తెలిపారు.
News February 14, 2025
వనపర్తి: ఇసుకను అక్రమ రవాణా చేస్తే చట్టరీత్యా చర్యలు: జిల్లా కలెక్టర్

వనపర్తి జిల్లాలో ఇసుక అవసరం ఉన్నవారు మన ఇసుక వాహనం ద్వారానే తీసుకోవాలని, దళారులను ఆశ్రయించవద్దని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సూచించారు. ఈ విషయంలో ప్రజలకు ఏమైనా సమస్యలు తలెత్తితే కంట్రోల్ రూమ్ 08545-233525కు ఫోన్ చేయాలన్నారు. జిల్లాలో అక్రమ ఇసుక వ్యాపారం చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.
News February 14, 2025
బాస్కెట్ బాల్ పోటీల్లో కోనసీమ యువతి ప్రతిభ

పిఠాపురంలో జరిగిన యూత్ రాష్ట్ర బాస్కెట్ బాల్ ఛాంపియన్ షిప్‌ను ఉమ్మడి తూ.గో. జిల్లా బాలికల జట్టు కైవసం చేసుకుంది. ఈ నెల 8 నుంచి 11 వరకు జరిగిన ఛాంపియన్ షిప్ పోటీల్లో అంబాజీపేటకు చెందిన నిమ్మకాయల చారిష్మా సాయి రుత్వి ఉమ్మడి తూ.గో. బాలికల జట్టు తరుపున ప్రాతినిధ్యం వహించింది. ఈ పోటీల్లో చారిష్మా సాయి రుత్వి ఉత్తమ ప్రతిభ కనబరిచింది. 9వ తరగతి చదువుతున్న సాయిరుత్విని గురువారం ఉపాధ్యాయులు అభినందించారు.