News August 21, 2024
మరికాసేపట్లో కండలేరుకు నీరు విడుదల

అనంతసాగరం మండలం, సోమశిల జలాశయం నుంచి మరికాసేపట్లో కండలేరుకు కృష్ణా జలాలను అధికారులు విడుదల చేయనున్నారు. ప్రస్తుతం జలాశయంలో 26 టీఎంసీల నీరు నిల్వ ఉంది. రెండు రోజుల క్రితం జలాశయాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సందర్శించిన విషయం తెలిసిందే. తమ ప్రాంతాలకు కూడా నీరు విడుదల చేయాలని ఎమ్మెల్యేలు సోమిరెడ్డి చంద్ర మోహన్ రెడ్డి, కురుగొండ్ల రామకృష్ణ ముఖ్యమంత్రిని కోరినట్లు సమాచారం.
Similar News
News July 7, 2025
నెల్లూరులో సోమవారం మంత్రి లోకేశ్ పర్యటన వివరాలు:

☞ ఉ. 9 గంటలకు VR మున్సిపల్ హైస్కూల్‌ను ప్రారంబోత్సవం
☞ 11 గంటలకు సిటీ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు
☞ మ.12 గంటలకు నాయకుల సమన్వయ సమావేశానికి హాజరవుతారు
☞ సాయంత్రం 4 గంటలకు బారాషాహీద్ దర్గాలో జరిగే రొట్టెల పండగ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు.
News July 6, 2025
మంత్రి లోకేశ్‌కు స్వాగతం పలికిన అబ్దుల్ అజీజ్

జిల్లా పర్యటనలో భాగంగా మంత్రి లోకేశ్ ఆదివారం రాత్రి రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు. ఎయిర్ పోర్ట్‌లో ఆయనకు ఏపీ వక్ఫ్ బోర్డ్ ఛైర్మన్ అబ్దుల్ అజీజ్ స్వాగతం పలికారు. అనంతరం వారు రోడ్డు మార్గానా నెల్లూరుకు పయనమయ్యారు.
News July 6, 2025
ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదు: కలెక్టర్

నెల్లూరు బారాషహిద్ దర్గాలో రొట్టెల పండుగ వైభవంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం పండుగ ఏర్పాట్లు, భద్రత, వసతులను కలెక్టర్ ఆనంద్, ఎస్పీ కృష్ణకాంత్ పరిశీలించారు. భక్తులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని కలెక్టర్ అధికారుల్ని ఆదేశించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు నిరంతరం పర్యవేక్షించాలని ఎస్పీ సూచించారు.