News February 23, 2025

మరికాసేపట్లో తిరుపతికి రానున్న CM 

image

రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరికాసేపట్లో రేణిగుంటకు రానున్నారు. 10.55 నిమిషాలకు ఆయన రేణిగుంట విమానాశ్రయం చేరుకోనున్నారు. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో ఉదయం 11:10కి తుకివాకంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాలుకు చేరుకుంటారు. అక్కడ టీడీపీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు నరసింహ యాదవ్ కుమారుని వివాహానికి హాజరవుతారు. అనంతరం నెల్లూరు జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు.

Similar News

News March 27, 2025

విశాఖలో లులూ మాల్‌కు భూమి కేటాయింపు

image

విశాఖలో లులూ గ్రూప్ నిర్మించనున్న షాపింగ్ మాల్, హైపర్ మార్కెట్ల నిర్మాణానికి భూమి కేటాయించాలని ఏపీ ప్రభుత్వం ఆదేశించింది. ఏపీఐఐసీ ద్వారా భూకేటాయింపులు చేసేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బీచ్ రోడ్‌లోని హార్బర్ పార్కులో ఉన్న 13.43 ఎకరాలను ఏపీఐఐసీకి బదలాయించాలని వీఎంఆర్డీఏకు ఆదేశాలు జారీ చేసింది. లులూ గ్రూప్ విశాఖలో పెట్టుబడులకు ఎస్ఐపీబీలో ఆమోదించినట్టు పరిశ్రమల శాఖ తెలిపింది.

News March 27, 2025

సోషల్ మీడియాలో నటి ప్రైవేటు వీడియో లీక్

image

తమిళ నటికి చెందిన ఓ ప్రైవేట్ వీడియో X, ఇన్‌స్టా, టెలిగ్రామ్‌లో ప్రత్యక్షం కావడం తీవ్ర కలకలం రేపింది. 14 నిమిషాల నిడివి గల ఆ వీడియో క్యాస్టింగ్ కౌచ్ ఉదంతానికి నిదర్శనమని సినీ అభిమానులు ఫైర్ అవుతున్నారు. దీంతో ట్విటర్‌లో ఆమె పేరు ట్రెండ్ అవుతోంది. మరోవైపు వీడియో ఆ నటిది కాదని, ఆమె ముఖాన్ని ఎడిట్ చేశారని మరికొందరు పేర్కొంటున్నారు. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. నటికి ఇన్‌స్టాలో 420K ఫాలోవర్లున్నారు.

News March 27, 2025

రాజమండ్రి : వెంటిలేటర్‌పై అంజలి

image

రాజమండ్రి కిమ్స్ ఆసుపత్రిలో ఆత్మహత్యాయత్నం చేసుకున్న అంజలి వెంటిలేటర్ పైనే చికిత్స పొందుతోంది. దీనికి ఏజీఎం దీపకే కారణమని విద్యార్థిని తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో ప్రకాశ్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. యువకుడి కుటుంబీకులు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె ఆరోగ్యంలో ఏమాత్రం మెరుగులేదని వైద్యులు తెలిపారు. కాగా ఆమె తల్లిదండ్రులు తమ కూతురు బతికి వస్తుందని, రావాలని ఆశతో ఎదురుచూస్తున్నారు.

error: Content is protected !!