News May 10, 2024
మరికాసేపట్లో నకిరేకల్‌కు సీఎం రేవంత్ రెడ్డి

పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు నకిరేకల్‌లోని ఎర్పాటు చేసిన జనజాతర సభకు సీఎం రేవంత్ రెడ్డి మరికాసేపట్లో చేరుకోనున్నారు. జనజాతర సభకు ఇప్పటికే కార్యకర్తలు, నాయకులు, అభిమానులు భారీగా చేరుకుంటున్నారు. ఈ సభలో ఏఐసీసీ నాయకులు మల్లికార్జున్ ఖర్గే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొననున్నారు.
Similar News
News November 18, 2025
నల్గొండను మాదక ద్రవ్య రహిత జిల్లాగా మార్చాలి

నషాముక్త భారత్ కార్యక్రమం ఐదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా జిల్లాను మాదక ద్రవ్య రహితంగా మార్చే దిశగా ప్రతి విద్యా సంస్థ కృషి చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్ చంద్ర పవర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం ఐదో వార్షికోత్సవం నేపథ్యంలో కలెక్టరేట్ సమావేశ మందిరంలో వారు సమీక్ష సమావేశం నిర్వహించారు. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటానని అందరూ ప్రతిజ్ఞ చేయాలని తెలిపారు.

NLG: ఇంట్లో ఎంతమంది ఉంటారు? ఏం తింటారు!

2026 జనగణన నేపథ్యంలో తిప్పర్తి మండలంలో ఎంపిక చేసిన గ్రామాల్లో ముమ్మరంగా సర్వే నిర్వహిస్తున్నారు. మండలంలోని మామిడాల, ఇండ్లూరు, సర్వారం, తిప్పర్తి, జంగారెడ్డిగూడెంలలో జనగణన సర్వే చేస్తున్నారు. ఇంటి యజమాని పేరు, ఇంట్లో ఎంతమంది ఉంటున్నారు? రైస్ తింటారా లేదంటే గోధుమలు, జొన్నలతో చేసిన రొట్టెలు తింటారా? ఉండేది పెంకుటిల్లా? వంటి వివరాలు అడిగి వెంట వెంటనే యాప్‌లో నమోదు చేస్తున్నారు.