News August 21, 2024

మరికాసేపట్లో MLCగా బొత్స ప్రమాణ స్వీకారం

image

ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఇవాళ ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అమరావతిలోని శాసనమండలిలో ఈ మేరకు ఏర్పాట్లు చేశారు. బొత్స చేత శాసనమండలి ఛైర్మన్ కొయ్యే మోషేను రాజు ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ముందుగా తాడేపల్లిలో మాజీ సీఎం జగన్‌తో బొత్స భేటి అవుతారు.

Similar News

News September 15, 2024

పార్వతీపురంలో వందే భారత్ హాల్ట్‌కు అరకు ఎంపీ ప్రత్యేక చొరవ

image

పార్వతీపురంలో వందే భారత్ హాల్ట్ కోసం అరకు MP చెట్టి తనూజా రాణి ప్రత్యేక చొరవ చూపారు. ఈ మేరకు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌కు రెండు రోజుల క్రితం మర్యదపూర్వకంగా కలిశారు. ఈ క్రమంలో పార్వతీపురంలో వందే భారత్‌కు హాల్ట్ కల్పించాలని కోరుతూ వినితిపత్రం అందజేశారు. ఆమె ప్రతిపాదనల మేరకు రైల్వే మంత్రి DRM కార్యాలయానికి ఆదేశాలు జారీ చేశారు. ఫలితంగా పార్వతీపురం ప్రజలు అరకు MPకి ధన్యవాదాలు తెలుపుతున్నారు.

News September 15, 2024

వందే భారత్ ట్రైన్‌కు పార్వతీపురంలో హాల్ట్

image

నేటినుంచి ప్రారంభమయ్యే దుర్గ్-విశాఖపట్నం-దుర్గ్ వందే భారత్ రైలుకు పార్వతీపురంలో హాల్ట్ కల్పించారు. ముందుగా ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఉమ్మడి జిల్లాలో విజయనగరం ఒకటే హాల్ట్ ఇచ్చారు. దీంతో పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర విశాఖపట్నం డీఆర్ఎం సౌరవ్ ప్రసాద్, కేంద్ర రైల్వే సహాయ మంత్రికి వినతిపత్రం అందజేశారు. దీంతో జిల్లా కేంద్రమైన పార్వతీపురంలో కూడా హాల్ట్ కల్పించారు.

News September 15, 2024

సరియా జలపాతంలో విజయనగరం యువకుడి గల్లంతు

image

అనంతగిరి మండలంలోని సరియా జలపాతంలో ఇద్దరు గల్లంతయ్యారు. SI టి.మల్లేశ్వరరావు వివరాల ప్రకారం.. విజయనగరం జిల్లా పైడి భీమవరానికి చెందిన లంకా సాయికుమార్(30) విశాఖలోని దైవక్షేత్రాల సందర్శనకు బయల్దేరారు. ఈక్రమంలో సరియా జలపాతం వద్దకు శనివారం వెళ్లగా.. అక్కడ సాయికుమార్ కాలు జారి నీటిలో పడిపోయాడు. అక్కడే ఉన్న ఇండియన్ నేవీ ఉద్యోగి గమనించి సాయిని కాపాడే ప్రయత్నం చేశాడు. ఈక్రమంలో ఇద్దరూ నీటిలో మునిగిపోయారు.