News January 25, 2025
మరియపురం: పథకానికి అనర్హుడినని ముందుకొచ్చిన వ్యక్తికి సన్మానం

గీసుగొండ మండలం మరియపురం గ్రామ పంచాయతీ ఆవరణలో గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంలో అర్హుల జాబితాను చదవగా అందులో పేరు వచ్చిన గొలమారి జ్యోజిరెడ్డి అనే వ్యక్తి ఆ పథకానికి తాను అనర్హుడనని, ఆ పథకం తనకు వద్దని ముందుకు రాగా మండల ప్రత్యేక అధికారి డి.సురేష్, తహశీల్దార్ ఎండీ రియాజుద్దీన్ అతడిని శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఓ ఉదయశ్రీ తదితరులు పాల్గొన్నారు.
Similar News
News July 8, 2025
WGL: నేడు 118 విద్యాలయాల్లో ‘స్ఫూర్తి’

వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో స్ఫూర్తి
కార్యక్రమం నిర్వహించనున్నారు. జిల్లా వ్యాప్తంగా 118 విద్యాలయాల్లో బ్యాంకర్లు, జర్నలిస్టులు, సీనియర్ సిటిజన్లు సమాజంలో జరుగుతున్న సవాళ్లపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తారు.
News July 8, 2025
వరంగల్ జిల్లాలో 37.6 శాతం వర్షాపాతం నమోదు

జిల్లా వ్యాప్తంగా 13 మండలాల్లో వర్షపాతం మోస్తరుగా నమోదైనట్లుగా వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. జిల్లా వ్యాప్తంగా 37.6 శాతం నమోదైంది. గీసుకొండ, దుగ్గొండి, నల్లబెల్లి, ఖిలా వరంగల్, మండలాల్లో మోస్తరు వర్షం కురవగా పర్వతగిరిలో వర్షం కురువలేదని తెలిపారు. వర్ధన్నపేట, రాయపర్తి, ఖానాపూర్, చెన్నారావుపేట, ఖానాపూర్, నర్సంపేట, మండలాల్లో తక్కువ వర్షాపాతం నమోదైంది.
News July 8, 2025
రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం జాయింట్ సెక్రటరీగా సూర్యనారాయణ

రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం జాయింట్ సెక్రటరీగా వరంగల్‌కు చెందిన సూర్యనారాయణ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా సూర్యనారాయణ మాట్లాడుతూ.. రేషన్ డీలర్ల సంక్షేమానికి అహర్నిశలు కృషి చేస్తానని అన్నారు. రేషన్ డీలర్ల కష్ట సుఖాలు పాలుపంచుకుని వారి సమస్యలు తీర్చడానికి సంఘం తరఫున అన్ని విధాలా ముందు ఉంటానని హామీ ఇచ్చారు. పోస్ట్ రావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.