News November 9, 2024
మరి కాసేపట్లో శ్రీశైలానికి CM చంద్రబాబు

CM చంద్రబాబు మరి కాసేపట్లో విజయవాడ ప్రకాశం బ్యారేజీ నుంచి సీ ప్లేన్ ద్వారా శ్రీశైలం చేరుకోనున్నారు. ఆయనతో పాటు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, కందుల దుర్గేశ్, ఇతర ఉన్నతాధికారులు సీ ప్లేన్‌లో మధ్యాహ్నం 12:40 గంటలకు శ్రీశైలం రానున్నారు. కాగా సీఎం రాక కోసం శ్రీశైలంలో టీడీపీ శ్రేణులు ఎదురు చూస్తున్నాయి.
Similar News
News October 22, 2025
Congratulations మేఘన

పెద్దకడబూరు జడ్పీ పాఠశాలలో చదివే 9వ తరగతి విద్యార్థిని మేఘన ‘క్వాంటం ఏజ్ బిగిన్స్-పొటెన్షియల్ అండ్ చాలెంజెస్’ అనే అంశంపై జరిగిన రాష్ట్రస్థాయి సెమినార్లో ప్రతిభ చాటారు. ఈ మేరకు ప్రశంసా పత్రం, మెడల్ మంగళవారం హెచ్ఎం ఉమా రాజేశ్వరమ్మ చేతుల మీదుగా మేఘనకు అందజేశారు. మనమంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో ఉన్నామని, కాబట్టి విద్యార్థులు క్వాంటం మెకానిక్స్ అనే అంశంపై ఆసక్తిని పెంపొందించుకోవాలన్నారు.
News October 21, 2025
ప్రాథమిక స్థాయిలోనే ఆంగ్ల భాషపై దృష్టి పెట్టండి: కలెక్టర్

ప్రాథమిక స్థాయిలోనే ఆంగ్ల భాషపై దృష్టి సారించాలని, అందుకు అవసరమైన కార్యాచరణ రూపొందించాలని జిల్లా విద్యాశాఖ అధికారులను కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి ఆదేశించారు. మంగళవారం జిల్లా విద్యాధికారి శామ్యూల్ పాల్‌తో పాటు విద్యాశాఖ అధికారులతో పూర్వ ప్రాథమిక విద్యపై కలెక్టర్ సమీక్ష చేశారు. ప్రాథమిక విద్యలోనే ఆంగ్ల భాష నైపుణ్యాలను విద్యార్థులకు అందించేందుకు 20 మంది రిసోర్స్ పర్సన్లను నియమించాలన్నారు.
News October 21, 2025
రైతు సంక్షేమంపై దృష్టి సారించండి: కలెక్టర్

వ్యవసాయ సహాయక శాఖల పనితీరు, రైతులకు అందిస్తున్న సేవలపై కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి మంగళవారం మినీ కాన్ఫరెన్స్ హాల్లో అగ్రికల్చర్ అల్లయిడ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో వ్యవసాయ, పశుసంవర్ధక, పాల, మత్స్య, ఉద్యాన, మార్కెటింగ్ శాఖల అధికారులు పాల్గొన్నారు. రైతులకు సమయానికి విత్తనాలు, ఎరువులు, సబ్సిడీ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.