News November 19, 2024

మరుగుదొడ్లు ఉండేవిధంగా ప్రజలందరూ ప్రతిజ్ఞ తీసుకోవాలి: కలెక్టర్

image

ప్రతి ఇంటిలో, ప్రతి గ్రామంలో మరుగుదొడ్లు ఉండేవిధంగా ప్రజలందరూ ప్రతిజ్ఞ తీసుకోవాలని నెల్లూరు జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రపంచ టాయిలెట్ దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం తిక్కన ప్రాంగణంలో జిల్లా తాగునీరు, పారిశుద్ధ్య మిషన్ జిల్లా స్థాయి సభ్యుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. డిసెంబర్ 10వ తేదీ వరకు జిల్లాలో ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.

Similar News

News March 12, 2026

ముత్యాలమ్మ జాతరలో డ్రోన్లతో నిఘా

image

తూర్పు కనుపూరు ముత్యాలమ్మ తల్లి జాతర ఘనంగా జరిగింది. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని నిరంతరం డ్రోన్ కెమెరాలతో నిఘా ఉంచామని నెల్లూరు జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల తెలిపారు. కమాండ్ కంట్రోల్ సీసీ టీవీ ఫుటేజ్‌తో పాటు డ్రోన్ల పర్యవేక్షణ కొనసాగించారు. జాతరలో అసాంఘిక కార్యక్రమాలు, గ్యాంబ్లింగ్, బెట్టింగ్ వంటివి జరగకుండా అరికట్టారు.

News March 12, 2026

నెల్లూరు: నిర్లక్ష్యం చేస్తే కంటి చూపు పోతుంది..!

image

నెల్లూరు జిల్లాలో గ్లకోమా(నీటి కాసుల) బాధితుల సంఖ్య పెరుగుతోంది. నెల్లూరు పెద్దాసుపత్రికి పెద్ద ఎత్తున బాధితులు వస్తున్నారు. 2020లో 250 కేసులు, 2021లో 400, 2022లో 440, 2023లో 500, 2024లో 567, 2025లో 600 కేసులు నమోదయ్యాయి. ఈ వ్యాధిని అలసత్వం చేస్తే.. శాశ్వత అంధకారం నెలకొంటుందని GGH కంటి డాక్టర్ వసంత తెలిపారు. మీకూ ఈ సమస్య ఉంటే వెంటనే చెక్ చేసుకోండి.

News March 12, 2026

నెల్లూరు: హాల్ టికెట్లకు పూజలు

image

నెల్లూరు జిల్లాలో ఈనెల 16వ తేదీ నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఉత్తమ ఫలితాలు సాధించేలా అనుగ్రహించాలని కోరుతూ విద్యార్థులు జొన్నవాడ శ్రీమల్లికార్జున స్వామి సమేత కామాక్షితాయికి పూజలు చేశారు. బుచ్చి మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన విద్యార్థులు ఆలయంలో హాల్ టికెట్లకు పూజలు చేయించుకున్నారు. ఇతర ప్రాంతాల్లోనూ ఇలాగే పూజలు చేయిస్తున్నారు.