News June 14, 2024
మరోసారి కోటంరెడ్డికే ఆ పదవి ఇస్తారా..?

నెల్లూరుకు చెందిన ఆర్యవైశ్య నేత ముక్కాల ద్వారకానాథ్ తన నెల్లూరు అర్బన్ డెవలప్‌మెంట్(నుడా) ఛైర్మన్ పదవికి ఇటీవల రాజీనామా చేశారు. ప్రభుత్వం నిన్న ఆయన రాజీనామాను ఆమోదించింది. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఛైర్మన్‌గా పని చేశారు. మరి తాజా ప్రభుత్వంలో ఆయనకే అవకాశం వస్తుందా? కొత్తవారికి ఛాన్స్ ఇస్తారా అనేది తెలియాల్సి ఉంది.
Similar News
News September 15, 2025
నెల్లూరు:13 మందికి ఎంపీడీవోలుగా పదోన్నతి

11 మంది డిప్యూటీ ఎంపీడీవోలకు ఇద్దరు ఏవోలకు ఎంపీడీవోలుగా పదోన్నతి కల్పిస్తూ సోమవారం జడ్పీ ఇన్‌ఛార్జ్ సీఈవో మోహన్ రావు ఉత్తర్వులు జారీ చేశారు. నెల్లూరు జిల్లాలో నలుగురు డిప్యూటీ ఎంపీడీవోలకు, తిరుపతి జిల్లాలో ఇద్దరు డిప్యూటీ ఎంపీడీవోలకు ప్రకాశం జిల్లాలో నలుగురు, బాపట్ల జిల్లాలో ఒకరికి పదోన్నతి కల్పించారు. అలాగే నెల్లూరు జిల్లాలో ఏవోగా పనిచేస్తున్న ఒకరిని బాపట్ల జిల్లాలో ఒకరిని ఎంపీడీవోగా నియమించారు.
News September 15, 2025
ఉదయగిరి: ఏటీఎం మార్చి నగదు కాజేసిన కేటుగాడు

ఉదయగిరిలో ఏటీఎం కార్డు మార్చి నగదు కాజేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈనెల 8వ తేదీన సినిమా హాల్ వీధికి చెందిన ఓ మహిళ తన ఖాతాలో ఉన్న డబ్బులను డ్రా చేసేందుకు ఏటీఎం సెంటర్‌కి వచ్చింది. అక్కడే ఉన్న ఓ వ్యక్తిని డబ్బులు డ్రా చేసి ఇవ్వాలని కోరింది. దీంతో ఆ వ్యక్తి కొంత డబ్బులు డ్రా చేసి ఆమెకు సంబంధించిన ఏటీఎం కార్డు ఇవ్వకుండా వేరే కార్డు మార్చి అందులోని రూ.8 వేలు నగదును ఆ కేటుగాడు కాజేశారు.
News September 15, 2025
అక్టోబర్ 15 వరకు గాలికుంటు వ్యాధి టీకాలు : డీడీ

జిల్లాలో ఈ నెల 15 నుంచి వచ్చే నెల 15వ తేదీ వరకు పశువులకు గాలికుంటు వ్యాధి టీకాలను వేస్తున్నట్లు పశు సంవర్ధక శాఖ డీడీ సోమయ్య తెలిపారు. స్థానిక ఎన్టీఆర్ నగర్ ప్రాంతంలో పశు వ్యాధి నియంత్రణలో భాగంగా పశువులకు గాలి కుంటు టీకాల కార్యక్రమాన్ని ఏడీలు రామచంద్రరావు, చైతన్య కిషోర్‌లతో కలిసి ప్రారంభించారు. నాలుగు మాసాలు నిండిన పశువులకు ఈ టీకాలను తప్పనిసరిగా వేయించాలని, ఎలాంటి అనుమానాలు అవసరం లేదన్నారు.