News December 10, 2024
మరోసారి ఘాటెక్కిన కడప రాజకీయం

కడపలో రాజకీయం మరోసారి ఘాటెక్కింది. తాగునీటి సమస్య లేకున్నా ఉన్నట్లు MLA మాధవి చెప్పడం విడ్డూరంగా ఉందని మాజీ MLA అంజాద్ బాషా వ్యాఖ్యానించారు. దీనికి జిల్లా TDP అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి ‘రా వీధుల్లోకి వెళ్లి ప్రజలను అడుగుదాం. ఇలా చెప్తే ప్రజలు గాడిద మీద ఊరేగిస్తారు’ అని ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. ఇటీవల పవన్ కళ్యాణ్ కడపకు వచ్చిన సందర్భంగా MLA నీటి సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లడంతో ఈ వివాదం మొదలైంది.
Similar News
News December 2, 2025
ప్రొద్దుటూరు: అతిగా మద్యం సేవించి వ్యక్తి మృతి

ప్రొద్దుటూరు: స్థానిక గాంధీరోడ్డులో సోమవారం రాత్రి అతిగా మద్యం సేవించి వ్యక్తి మృతి చెందాడు. అంబులెన్స్ సిబ్బంది స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆస్పత్రి ఔట్ పోస్ట్ పోలీస్ షబ్బీర్ రికార్డుల్లో వివరాలు నమోదు చేశారు. అతని వద్ద లభించిన రైస్ కార్డ్‌లోని వివరాల మేరకు షేక్ గౌస్ మొహిద్దీన్‌గా గుర్తించారు. కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.
News December 2, 2025
కడప: జిల్లాలో రూ.83.38 కోట్ల మద్యం విక్రయం

కడప జిల్లాలో నవంబరు నెలలో రూ.83.38 కోట్ల మద్యాన్ని విక్రయించారు. 44,233 కేసులు బీర్లు, 1,24,430 కేసులు మద్యం విక్రయించారు. కడపలో రూ.22.85 కోట్లు, ప్రొద్దుటూరులో రూ.15.61 కోట్లు, మైదుకూరులో రూ.7.74 కోట్లు, సిద్దవటంలో రూ.2.43 కోట్లు, పులివెందులలో రూ.9.73 కోట్లు, ఎర్రగుంట్లలో రూ.6.62 కోట్లు, ముద్దనూరులో రూ.3.52 కోట్లు, జమ్మలమడుగులో రూ.5.74 కోట్లు, బద్వేల్‌లో రూ.9.10 కోట్లు మద్యాన్ని విక్రయించారు.
News December 1, 2025
కడప: వాయిదా పడిన డిగ్రీ పరీక్ష.. మళ్లీ ఎప్పుడంటే.!

దిత్వా తుఫాను కారణంగా వాయిదా పడిన యోగివేమన విశ్వవిద్యాలయ డిగ్రీ, పీజీ పరీక్షల తేదీలను విశ్వవిద్యాలయ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ కె.ఎస్.వి. కృష్ణారావు సోమవారం ప్రకటించారు. డిసెంబర్ 1వ తేదీన డిగ్రీ వారికి జరగాల్సిన పరీక్షను ఈ నెల 6వ తేదీ ఉదయం నిర్వహిస్తున్నామన్నారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఇంటిగ్రేటెడ్ పీజీ విద్యార్థులకు ఈనెల 9వ తేదీ ఉదయం పరీక్ష నిర్వహిస్తున్నామని తెలిపారు.


