News November 25, 2024

మరోసారి నెం.1గా నిలిచిన విశాఖ

image

చిన్న తరహా పరిశ్రమల(MSME) ఏర్పాటులో రాష్ట్రం వేగంగా పుంజుకుంటోంది. సామాజిక ఆర్థిక సర్వే 2023-24 ప్రకారం విశాఖలో రూ.648.4 కోట్ల పెట్టుబడితో 16,505 పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. దీంతో విశాఖ మొదటి స్థానంలో నిలిచింది. తర్వాతి స్థానాల్లో గుంటూరు, నెల్లూరు ఉన్నాయి. అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో 968 యూనిట్లు, పార్వతీపురం మన్యంలో 2,213 యూనిట్ల పరిశ్రమలు ఏర్పడ్డాయి.

Similar News

News November 28, 2025

మ‌హాత్మా జ్యోతిరావ్ ఫూలేకు నివాళులర్పించిన విశాఖ కలెక్టర్

image

మ‌హాత్మా జ్యోతిరావ్ ఫూలే వ‌ర్ధంతిని పుర‌స్క‌రించుకొని శుక్ర‌వారం నౌరోజీ రోడ్డులోని ఆయన విగ్ర‌హానికి కలెక్టర్ ఎం.ఎన్.హ‌రేంధిర ప్ర‌సాద్ పూల‌మాల వేసి నివాళులర్పించారు. ఫూలే చేపట్టిన సామాజిక సంస్కరణలు, సేవలను గుర్తు చేసుకుంటూ నివాళులు అర్పించారు. ఫూలే అణగారిన కులాల అభ్యున్నతికి, స్త్రీ జనోద్ధరణకు విశేష సేవలు చేశారన్నారు.

News November 28, 2025

రేపు విశాఖ రానున్న పవన్ కళ్యాణ్

image

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విశాఖలో నిర్వహించే నేవీ డే ముందస్తు కార్యక్రమాలకు హాజరు కానున్నారు. శనివారం సాయంత్రం సముద్రికలో ఈ కార్యక్రమాలు జరగనున్నాయి. డిసెంబర్ 4న నేవీ డేకి సంబంధించి ముందస్తు కార్యక్రమాలు విశాఖలో చేపట్టారు. పవన్ కళ్యాణ్ శనివారం మధ్యాహ్నం 3 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి షీలా నగర్.. మారుతీ జంక్షన్ మీదుగా ఈస్టర్న్ నావల్ కమాండ్‌కు చేరుకుంటారు.

News November 28, 2025

శ్రీహరిపురంలో యువకుడు ఆత్మహత్య

image

శ్రీహరిపురంలోని తన ఇంట్లో ఓ యువకుడు వంశీ ఫ్యానుకు ఊరివేసుకుని తెల్లవారుజామున ఆత్మహత్య చేసుకున్నాడు. మల్కాపురం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతికి గల కారణాలపై కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మల్కాపురం సీఐ గొల్లగాని అప్పారావు తెలిపారు.