News April 19, 2024

మరోసారి పెద్దిరెడ్డి కుమార్తెతో కలిసే నామినేషన్

image

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నాలుగోసారి పుంగనూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. మంత్రి కుమార్తె శ్రీశక్తితో కలిసి నామినేషన్‌ను ఆర్వోలకు అందజేయడం 20 ఏళ్లుగా సెంటిమెంటుగా కొనసాగుతోంది. ఈసారి కూడా ఆమె చేత హనుమంతరాయనదిన్నెలో ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజల అనంతరం తండ్రి పెద్దిరెడ్డితో కలిసి ఆర్వోకు నామినేషన్ పత్రాలు అందజేశారు. అనంతరం ప్రచారంలో పాల్గొన్నారు.

Similar News

News September 9, 2024

ఏర్పేడులో నేడు వాక్ ఇన్ ఇంటర్వ్యూలు

image

ఏర్పేడు వద్ద ఉన్న ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) తిరుపతి నందు సోమవారం ఉదయం 9.30 గంటలకు ప్లేస్మెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్‌కు వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు కార్యాలయం ప్రకటనలో పేర్కొంది. బీటెక్ పాసైన, అనుభవం కలిగిన అభ్యర్థులు అర్హులన్నారు. పూర్తి వివరాలకు https://www.iittp.ac.in/ వెబ్ సైట్ చూడాలని సూచించారు.

News September 8, 2024

చిత్తూరులో ఉరి వేసుకుని వ్యక్తి సూసైడ్

image

మానసిక స్థితి బాగోలేక ఓ వ్యక్తి చెట్టుకు ఉరి వేసుకొని మృతి చెందిన ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చిత్తూరు టూ టౌన్ సీఐ నెట్టి కంటయ్య తెలిపారు. శరవణ పురానికి చెందిన శంకర్ పిలై (68) కొంతకాలంగా పాగాయం మెంటల్ హాస్పిటల్‌లో ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఆదివారం గిరింపేట గాయత్రి చిల్డ్రన్స్ పార్క్‌ వద్ద చెట్టుకు ఉరివేసుకొని మృతి చెందినట్లు సీఐ తెలిపారు.

News September 8, 2024

చిత్తూరు: జపాన్‌లో ఉద్యోగావకాశాలు

image

జపాన్ దేశంలో నర్సులుగా పనిచేయడానికి ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని చిత్తూరు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి గుణశేఖర్ రెడ్డి కోరారు. బెంగళూరులో జపాన్ భాషపై శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. జీతం రూ.1.10 లక్షల నుంచి రూ.1.40 లక్షల వరకు ఉంటుందన్నారు. ఇతర వివరాలకు 99888 53335లో సంప్రదించాలని కోరారు.