News March 27, 2025

మరోసారి బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా విష్ణు వర్ధన్ రెడ్డి

image

సంగారెడ్డి బార్ అసోసియేషన్‌లో గురువారం జరిగిన ఎన్నికల్లో మరోసారి అధ్యక్షుడిగా విష్ణువర్ధన్ రెడ్డి విజయం సాధించారు. ఉపాధ్యక్షుడిగా భూపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా వి మహేశ్, సంయుక్త కార్యదర్శిగా ఎన్ మల్లేశం, క్రీడల కార్యదర్శిగా టి శ్రీనివాస్, గ్రంధాలయ కార్యదర్శిగా నిజాముద్దీన్ రషీద్, మహిళ ప్రతినిధిగా మంజుల రెడ్డి, కార్యవర్గ సభ్యులుగా బుచ్చయ్య, సుభాష్ చందర్, నరసింహ, మాణిక్ రెడ్డి ఎన్నికయ్యారు.

Similar News

News December 5, 2025

కరీంనగర్: అభ్యర్థులకు కోతుల ‘పంచాయితీ’..!

image

కరీంనగర్ జిల్లాలోని పల్లెల్లో పంచాయతీ ఎన్నికల సందడి జోరందుకుంది. తొలి విడత పోలింగ్ జరిగే గ్రామాల్లో అభ్యర్థులు ప్రచారం ముమ్మరం చేశారు. గ్రామంలోని కోతుల ‘పంచాయితీ’ తీరిస్తేనే ‘పంచాయతీ’ పట్టం కడతామంటూ పలుచోట్ల అభ్యర్థులకు ఓటర్లు తెగేసి చెప్తున్నారు. దీంతో చేసేది లేక సమస్య తీరుస్తామని అభ్యర్థులు హామి ఇస్తున్నారు. మరి మీ గ్రామంలోనూ కోతుల సమస్య ఉందా?.

News December 5, 2025

ఇండిగో సంక్షోభం.. కేంద్రం సీరియస్

image

ఇండిగో విమాన సర్వీసుల అంతరాయాన్ని కేంద్రం తీవ్రంగా పరిగణించింది. ఈ సంక్షోభంపై ఉన్నతస్థాయి దర్యాప్తుకు ఆదేశిస్తున్నట్లు ప్రకటించింది. ఇందుకు కారణమైన వారిని కఠినంగా శిక్షిస్తామని స్పష్టం చేసింది. ప్రయాణికుల సంక్షేమం, భద్రతపై ప్రత్యేక దృష్టి సారించినట్లు పేర్కొంది. మూడు రోజుల్లో సమస్యను పూర్తిగా పరిష్కరిస్తామని వెల్లడించింది. పైలట్ల రోస్టర్ సిస్టమ్‌ను తాత్కాలికంగా నిలిపివేసినట్టు చెప్పింది.

News December 5, 2025

ఇవాళే ‘అఖండ-2’ రిలీజ్?

image

నందమూరి బాలకృష్ణ నటించిన ‘అఖండ-2’ చిత్రాన్ని ఇవాళ రాత్రి ప్రీమియర్స్‌తో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. సమస్యలన్నీ కొలిక్కి రావడంతో ఏ క్షణమైనా మూవీ రిలీజ్‌పై ప్రకటన వచ్చే అవకాశం ఉందని సినీవర్గాలు తెలిపాయి. ఇవాళ సెకండ్ షోతో ప్రీమియర్స్, రేపు ప్రపంచవ్యాప్త విడుదలకు కసరత్తు చేస్తున్నట్లు పేర్కొన్నాయి. లేకపోతే ఈనెల 19కి రిలీజ్ పోస్ట్‌పోన్ కానున్నట్లు సమాచారం.