News February 27, 2026

మరో ప్రాణం తీసిన లోన్ యాప్

image

TG: ప్రభుత్వాలు హెచ్చరికలు చేస్తున్నా లోన్‌ యాప్‌ ఏజెంట్ల ఆగడాలు ఆగట్లేదు. వారి వేధింపులు తాళలేక మరో వ్యక్తి ప్రాణం తీసుకున్నారు. మేడ్చల్(D) ఘట్‌కేసర్‌లో ఆటో డ్రైవర్ సాయికుమార్(35) భార్య పేరిట లోన్ యాప్‌లో రుణం తీసుకున్నారు. సకాలంలో చెల్లించకపోవడంతో ఏజెంట్లు వేధించారు. భార్య ఫొటోలను SMలో పెడతామంటూ బ్లాక్‌మెయిల్ చేయడంతో ఉరివేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News April 12, 2026

‘ఇంటి గుట్టు లంకకు చేటు’.. తెలుసుకోండి!

image

కుటుంబ రహస్యాలను బయటపెట్టడం వల్ల సొంతవారికే తీవ్ర నష్టం కలుగుతుందని చెప్పే సందర్భంలో ఈ సామెతను ఉపయోగిస్తాం. రామాయణంలో విభీషణుడు లంక రక్షణ వ్యవస్థ గురించి రాముడికి చెబుతారు. అలాగే తన సోదరుడు రావణుడు, ఆయన పిల్లలు ఇంద్రజిత్తు, అతికాయుడి బలాల గురించి వివరిస్తారు. దీనివల్లే లంక నాశనమైంది. మన ఇంటి గోప్యతను కాపాడుకోవడం ఎంత ముఖ్యమో ఈ సామెత వివరిస్తుంది.
<<-se>>#EPICSAYINGS<<>>

దేశాల వారీగా అత్యధిక ఉష్ణోగ్రతలు

image

*అమెరికా- 56.7 డిగ్రీలు (1913)
*ట్యునీషియా- 55 (1931)
*కువైట్- 54 (2016)
*ఇరాన్- 54 (2017)
*ఇజ్రాయెల్- 54 (1942)
*ఇరాక్- 53.9 (2016)
*పాకిస్థాన్- 53.7 (2017)
*యూఏఈ- 52.1 (2002)
*భారత్- 50.6 (2016)