News January 11, 2026
మరో యాదాద్రిగా కీసరగుట్ట? మోక్షం ఎన్నడు!

HYD శివారు కీసరగుట్ట రామలింగేశ్వర స్వామి దేవాలయాన్ని మరో యాదాద్రి దేవాలయంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం రూ.202 కోట్లను కేటాయించింది. నాటి నుంచి కోట్లాది మంది భక్తులు రాష్ట్రంలో మరో యాదాద్రి స్థాయిలో కీసరగుట్టను చూడాలనే ఆశతో వేచి చూస్తున్నారు. కానీ.. ఇప్పటి వరకు ప్రాజెక్టు ముందుకు పడకపోవడం, దేవాలయం వద్ద పనులు ప్రారంభం కాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News January 18, 2026
మంచిర్యాల: రేపటి ‘ప్రజావాణి’ రద్దు

మున్సిపల్ ఎన్నికల విధులు, మంత్రుల పర్యటన నేపథ్యంలో సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ కుమార్ దీపక్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇతర పరిపాలనా పరమైన పనుల ఒత్తిడి కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు, దరఖాస్తుదారులు ఈ మార్పును గమనించి సహకరించాలని, కలెక్టరేట్‌కు రావొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.
News January 18, 2026
VZM: కలెక్టరేట్‌లో రేపు PGRS కార్యక్రమం

జిల్లా ప్రజల సమస్యల పరిష్కారానికి సోమవారం ఉదయం విజయనగరం కలెక్టరేట్‌లో PGRS నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రాంసుందర్ రెడ్డి తెలిపారు. ఉదయం 10 గంటలు నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరిగే ఈ కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొని అర్జీలు స్వీకరిస్తారన్నారు. మండల కేంద్రాలు, మున్సిపాలిటీల్లోనూ అర్జీల స్వీకరణ ఉంటుందన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
News January 18, 2026
నర్సింగ్ విద్యార్థులకు జపనీస్, జర్మన్ భాషలు నేర్పిస్తాం: CM

TG: నర్సింగ్ కోర్సు చేసిన వారికి జపాన్, జర్మనీలో మంచి డిమాండ్ ఉందని CM రేవంత్ అన్నారు. విద్యార్థులకు నర్సింగ్ కోర్సుతో పాటు జపనీస్, జర్మన్ భాషలు నేర్పేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. ఎడ్యుకేషన్, హెల్త్‌కి తమ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందన్నారు. ఖమ్మం జిల్లా కూసుమంచిలో 100 పడకల ఆస్పత్రికి ఆయన శంకుస్థాపన చేశారు. JNTU కళాశాల, మద్దులపల్లి మార్కెట్ యార్డ్, నర్సింగ్ కాలేజీని ప్రారంభించారు.


