News June 1, 2024
మరో సర్వే.. విజయనగరంలో ఎవరికి ఎన్ని సీట్లు అంటే..?
విజయనగరంలో 09 సీట్లకు గాను NDA కూటమి 4-5 గెలుస్తుందని బిగ్‌టీవీ సర్వే తెలిపింది. 4-5 సీట్లు వైసీపీ సాధిస్తుందని అంచనా వేసింది. మొత్తంమీద 175 అసెంబ్లీ సీట్లకు గాను 106- 119 కూటమి, 56- 69 సీట్లు వైసీపీ విజయం సాధిస్తుందని వెల్లడించింది.
Similar News
News September 17, 2024
VZM: సిద్ధం కాని వందే భారత్ ట్రైన్ ఛార్జీలు
విశాఖ-దుర్గ్ వందే భారత్ రైలు టికెట్ ఛార్జీల చార్ట్ ఇంకా సిద్ధం కాలేదు. అధికారికంగా ఈ రైలు సోమవారం ప్రారంభమైనప్పటికీ, ఈ నెల 20 నుంచి రెగ్యులర్‌గా తిరుగుతుంది. ఈ నేపథ్యంలో టికెట్ ఫేర్ చార్ట్‌ను రెండు రోజుల్లోగా రెడీ చేసే అవకాశాలున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ప్రస్తుతం విజయనగరం నుంచి పార్వతీపురం వరకు ఎక్స్‌ప్రెస్ స్లీపర్ క్లాస్ అయితే రూ.145 ఉంది.
News September 17, 2024
నెల్లిమర్ల జనసేనలోకి నేడు భారీగా చేరికలు
నెల్లిమర్ల లో వైసీపీ పార్టీ నుంచి జనసేన పార్టీలోకి మంగళవారం భారీగా చేరికలు జరగనున్నాయి. వైసీపీ కీలక నేత చనమళ్లు వెంకటరమణ తో సహా ఇద్దరు కౌన్సిలర్లు, పలు గ్రామాలకు చెందిన సర్పంచ్, మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు జనసేన పార్టీ తీర్ధం పుచ్చుకోనున్నారు. సుమారు 5 వేల మందితో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే లోకం మాధవి హాజరుకానున్నారు.
News September 16, 2024
విశాఖ-దుర్గ్ వందేభారత్ టైమింగ్స్ ఇవే
విశాఖ నుంచి దుర్గ్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ వారంలో గురువారం మినహా ఆరు రోజులు నడపనున్నారు. 20829 నంబర్‌తో దుర్గ్‌లో ఉ.5:45కి బయలుదేరి అదే రోజు మ.1:45 నిమిషాలకు విశాఖ చేరుకుంటుంది. విశాఖ నుంచి 20830 నంబర్‌తో మ.1:50 నిమిషాలకు బయలుదేరి అదే రోజు రాత్రి 11:50 నిమిషాలకు దుర్గ్ చేరుకుంటుంది. ఈనెల 20వ నుంచి ఈ రైలు రెగ్యులర్‌గా తిరుగుతుందని ఈస్ట్ కోస్ట్ రైల్వే డీఆర్ఏం తెలిపారు.