News June 14, 2024
మరో 2 రోజుల్లో జగన్పై FIR నమోదు: RRR
తనను కొట్టిన ఘటనపై మాజీ సీఎం జగన్పై ఉండి టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజు (RRR) ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై మరో రెండు రోజుల్లో జగన్పై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారని RRR చెప్పారు. తిరుపతిలో ఆయన మాట్లాడుతూ.. నాలుగున్నరేళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత తాను ఘన విజయం సాధించానని చెప్పారు. తనకు స్పీకర్ పదవి ఇస్తే స్వీకరిస్తానని.. ఇవ్వకపోయినా తనకు ఉన్న బాధ్యతలను నిర్వర్తిస్తానని స్పష్టం చేశారు.
Similar News
News January 14, 2025
చంద్రగిరి: భయంతో బాలుడు ఆత్మహత్య
చంద్రగిరి పట్టణంలోని బీడీ కాలనీలో మంగళవారం విషాద ఘటన చోటుచేసుకుంది. సమీర్(12) అనే బాలుడు తన స్నేహితుడితో కలిసి మేడపై గాలిపటం ఎగరవేస్తున్నారు. ఈ క్రమంలో సమీర్ స్నేహితుడు కిందపడి గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. దీంతో సమీర్పై అతని మామ కోపంతో గదిలో పెట్టి తలుపు వేశాడు. తిరిగి వచ్చి కొడుతాడన్న భయంతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
News January 14, 2025
చంద్రగిరి: మంచి మనసు చాటుకున్న సీఎం
నారావారిపల్లెలో CM చంద్రబాబు వృద్ధ దంపతులను చూసి చలించిపోయి వారికి పెన్షన్ అందించేందుకు భరోసా ఇస్తూ మరోసారి మంచి మనసు చాటుకున్నారు. CM వారిని ఆప్యాయంగా పలకరిస్తూ ఎక్కడి నుంచి వచ్చారు.. సమస్య ఏంటని అడిగారు. తన పేరు నాగరాజమ్మ (62), భర్త సుబ్బరామయ్య అని తెలిపారు. పక్షవాతంతో సుమారు 5 సం. నుంచి బాధపడుతున్నానని తెలిపారు. వెంటనే దివ్యాంగ పెన్షన్ మంజూరుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను ఆదేశించారు.
News January 13, 2025
కాలినడకన తిరుమలకు చేరుకున్న ఇండియా క్రికెటర్
భారత క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి సోమవారం సాయంత్రం శ్రీవారి మెట్ల మార్గం ద్వారా కాలినడకన రాత్రి తిరుమలకు చేరుకున్నారు. ఆయనకు రిసెప్షన్ అధికారులు స్వాగతం పలికి బస ఏర్పాట్లు చేశారు. నితీశ్ రాత్రికి తిరుమలలో బస చేసి మంగళవారం ఉదయం వెంకటేశ్వరస్వామిని దర్శించుకోనున్నారు.