News February 27, 2025

మర్కుక్ రావాలని KCRకు ఆహ్వానం

image

మర్కుక్ మండలం అంగడి కిష్టాపూర్‌లోని పురాతన దేవాలయం శ్రీ ఉమామహేశ్వర స్వామి బ్రహ్మోత్సవ వేడుకలకు రావాలని గురువారం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆహ్వానం అందింది. ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో గజ్వేల్ బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డితో కలిసి అంగడికిష్టాపూర్ మాజీ సర్పంచ్ లక్ష్మీ రాములు గౌడ్, శ్రీ ఉమామహేశ్వర దేవాలయం ఛైర్మన్ ఆహ్వాన పత్రిక అందజేశారు. 

Similar News

News November 22, 2025

‘పండ్లు, కూరగాయల సాగుతో ఎక్కువ లాభం’

image

నారింజ పంట ఉత్పత్తికి నాణ్యమైన విత్తనాల కోసం నాగ్‌పూర్‌లో రూ.70 కోట్లతో క్లీన్‌ప్లాంట్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ తెలిపారు. భూసార పరీక్షలు, నాణ్యమైన విత్తనాలను అందజేయడంపై ICAR సైంటిస్టులు దృష్టిపెట్టాలన్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందాలంటే పండ్లు, కూరగాయ పంటలను సాగు చేయాలని.. యంత్రాలు, డ్రిప్ ఇరిగేషన్‌ వాడకంపై రైతులు అవగాహన పెంచుకోవాలని సూచించారు.

News November 22, 2025

మధ్యాహ్నంలోగా రిపోర్ట్ అందజేయండి: అదనపు కలెక్టర్

image

గ్రామాల్లోని పోలింగ్ స్టేషన్‌లలో కనీస వసతులు కల్పించాలని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) మధుసూదన్ నాయక్ ఆదేశాలు జారీ చేశారు. పంచాయతీ అధికారిణి నిఖిలతో కలిసి శనివారం ఎంపీడీఓలు, ఎంపీవోలు గ్రామ పంచాయతీ కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్ని గ్రామాల్లోని పోలింగ్ స్టేషన్స్‌లో విద్యుత్, తాగునీరు, వికలాంగులు, వృద్ధులకు ర్యాంప్ సౌకర్యం వసతులు పరిశీలన చేసి.. మధ్యాహ్నంలోగా రిపోర్ట్ అందజేయాలన్నారు.

News November 22, 2025

HYD: నేడు సీఐడీ విచారణకు మంచులక్ష్మి

image

నేడు సీఐడీ విచారణకు మంచులక్ష్మి హాజరుకానుంది. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో మంచు లక్ష్మిని సీఐడీ అధికారులు విచారణ చేపట్టనున్నారు. ఇప్పటికే ఈడీ విచారణను మంచులక్ష్మి ఎదుర్కొనగా.. మధ్యాహ్నం సీఐడీ సిట్ ఎదుట మంచు లక్ష్మి హాజరుకానున్నారు. కాగా, ఇప్పటికే రానా, విష్ణు ప్రియలను విచారించిన విషయం తెలిసిందే.