News April 10, 2024
మర్కూక్: రైతులు ఆందోళన చెందవద్దు: మంత్రి కోమటిరెడ్డి

రీజనల్ రింగ్ రోడ్డులో భూములు కోల్పోతున్న రైతులు ఆందోళన చెందవద్దని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సూచించారు. నల్గొండలోని ఆయన క్యాంపు కార్యాలయంలో మంత్రిని మర్కూక్ మండలం చేబర్తి, నర్సన్నపేట గ్రామాల రీజనల్ రింగ్ రోడ్డులో భూములు కోల్పోతున్న రైతులు కలిశారు. ఈ సందర్భంగా మంత్రి వారితో మాట్లాడుతూ.. రైతులు ఆందోళన చెందవద్దని, సీఎం దృష్టికి మీ సమస్య తీసుకెళ్లి, పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.
Similar News
News February 7, 2026
మెదక్: ఫిబ్రవరి 13న మున్సిపల్ ఎన్నికల లెక్కింపు

మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశామని కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ఫిబ్రవరి 13న ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది. కలెక్టరేట్‌లో కౌంటింగ్ సిబ్బందికి నిర్వహించిన శిక్షణలో పోస్టల్ బ్యాలెట్, లెక్కింపు విధానంపై అవగాహన కల్పించారు. నిబంధనల మేరకు కౌంటింగ్ ప్రక్రియ పకడ్బందీగా జరుగుతుందన్నారు.
News February 7, 2026
మెదక్: జర్నలిస్టుల అక్రిడిటేషన్లకు దరఖాస్తుల ఆహ్వానం: కలెక్టర్

2026–28 కాలానికి జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల జారీకి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ప్రస్తుతం ఉన్న కార్డుల గడువు ఫిబ్రవరి 28తో ముగియనున్న నేపథ్యంలో అర్హత గల జర్నలిస్టులు కొత్త కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సమాచార పౌరసంబంధాల శాఖ ద్వారా ఈ ప్రక్రియ కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు.
News February 7, 2026
మెదక్: మున్సిపల్ బరిలో న్యాయవాది

మెదక్ మున్సిపల్ ఎన్నికల్లో యువ న్యాయవాది జీవన్ రావు పోటీ చేస్తున్నారు. 2016లో లా పట్టా అందుకున్న జీవన్ రావు ప్రస్తుతం మెదక్ కోర్టులో ప్రాక్టీస్ నిర్వహిస్తున్నారు. 2020 మున్సిపల్ ఎన్నికల్లో పట్టణంలోని 7వ వార్డు నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా జీవన్ రావు సతీమణి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈసారి 6వ వార్డు రిజర్వేషన్ అనుకూలంగా రావడంతో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు.


