News April 18, 2024
మర్రిగూడ మీదుగా వెళ్ళనున్న రైలు మార్గం
డోర్నకల్- గద్వాల్ వరకు నూతనంగా నిర్మించనున్న రైలు మార్గం నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం మీదుగా వెళ్లనుంది. మండలంలోని పలు గ్రామాల్లో రైలు మార్గానికి సర్వే చేస్తున్నారు. నల్గొండ నుంచి మర్రిగూడ మండలం మీదుగా చింతపల్లి మండలం వైపు రైలు మార్గానికి అధికారులు, సిబ్బంది సర్వే చేస్తున్నారు. దీంతో రైలు వెళ్లనున్న గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News September 19, 2024
షీ టీమ్స్ అధ్వర్యంలో 70 కేసులు: ఎస్పీ సన్ ప్రీత్ సింగ్
మహిళాలు, విద్యార్థినులకు అండగా జిల్లాలో షీ టీమ్స్ పని చేస్తున్నాయని ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా నెల రోజులుగా జిల్లాలో షీ టీమ్స్ అధ్వర్యంలో 42 మందికి కౌన్సిలింగ్ ఇచ్చి, 28 అవగాహన కార్యక్రమాలు నిర్వహించామన్నారు. 13 ఫిర్యాదులు స్వకరించినట్లు చెప్పారు. ఆకతాయిలను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని 45 కేసులు నమోదు చేశామన్నారు. వేధింపులపై 87126 86056 ద్వారా ఫిర్యాదు చేయాలని చెప్పారు.
News September 19, 2024
యాదాద్రి ఎన్నికల ప్రధాన అధికారి సమీక్ష
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి నేడు యాదాద్రి జిల్లా కలెక్టరు కార్యాలయంలో జిల్లా కలెక్టరు హనుమంత్‌తో ఇంటింటి సర్వే ద్వారా చేపడుతున్న ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని మండలాల వారిగా సమీక్షించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రతి ఇంటిని సర్వే చేయాలని, పక్కాగా పారదర్శకమైన ఓటరు జాబితా రూపొందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు బెన్షాలోమ్, గంగాధర్ పాల్గొన్నారు.
News September 18, 2024
NLG: రోడ్డు ప్రమాదం.. మహిళా కానిస్టేబుల్ మృతి
సాగర్ సమీపంలో <<14133782>>రోడ్డుప్రమాదంలో<<>> చనిపోయిన మహిళను కానిస్టేబుల్ శ్రావణిగా గుర్తించారు. ఆమెది గద్వాల జిల్లా జోగులాంబ గ్రామం. కేటీదొడ్డి పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవలే శ్రావణికి ఎంగేజ్మెంట్ అయింది. కాబోయే భర్త వద్దకు వచ్చి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.