News February 14, 2025

మర్రిగూడ: లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సర్వేయర్

image

మర్రిగూడ తహశీల్దార్ కార్యాలయంపై శుక్రవారం ఏసీబీ అధికారులు దాడులు చేశారు. సరంపేట గ్రామానికి చెందిన ఓ రైతు ఎనిమిది గుంటల భూమి సర్వే విషయంపై సర్వేయర్ రవి నాయక్‌ను సంప్రదించగా.. అతడు రూ.15వేలు డిమాండ్ చేశాడు. దీంతో బాధిత రైతు ఏసీబీని ఆశ్రయించాడు. ఇవాళ మధ్యాహ్నం కార్యాలయంలో రవి రూ.12వేలు లంచం తీసుకుంటుండగా అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు.

Similar News

News February 23, 2026

నల్గొండ: గణనీయంగా తగ్గిన మాతా శిశు మరణాలు

image

రాష్ట్ర ప్రభుత్వం వైద్యారోగ్య శాఖలో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులు మాతా శిశువుల ఆరోగ్యానికి రక్షణ కవచంలా మారుతున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కార్పొరేట్ స్థాయి మౌలిక సదుపాయాలు, మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి రావడంతో గత ఎనిమిదేళ్లుగా జిల్లాలో మరణాల రేటు గణనీయంగా తగ్గుతోంది. 2018-19లో 335 శిశువులు, 14 మంది తల్లులు మరణించగా, 2025 నాటికి ఆ సంఖ్య 72 శిశువులకు, 9 మంది తల్లులకు పడిపోయింది.

News February 23, 2026

NLG: ఇందిరమ్మ ఇల్లు కట్టుకునేందుకు వెనకడుగు..!

image

నల్గొండ జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు నిబంధనలు శాపంగా మారాయి. పెరిగిన నిర్మాణ వ్యయం, ప్రభుత్వం విధించిన కఠిన నిబంధనలతో 3,300 ఇళ్ల మంజూరును ప్రభుత్వం రద్దు చేసింది. కేవలం రూ.5 లక్షల సాయం సరిపోక, బేస్‌మెంట్ ఖర్చులకే లక్షలు అవుతుండటంతో పేదలు వెనకడుగు వేస్తున్నారు. దీంతో కొత్త లబ్ధిదారుల ఎంపికకు యంత్రాంగం కసరత్తు చేస్తోంది. నిర్మాణ వ్యయం పెంచాలని లబ్ధిదారులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

News February 22, 2026

CM కప్.. ఫైనల్‌లో నల్గొండ హాకీ జట్టు

image

హైదరాబాద్‌లోని గచ్చిబౌలీ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జరుగుతున్న సీఎం కప్ క్రీడా పోటీలలో నల్గొండ బాలుర హాకీ జట్టు ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. ఆదివారం హోరాహోరీగా జరిగిన సెమీఫైనల్‌లో వనపర్తి జట్టుపై 1-0 తేడాతో గెలిచి తుది పోరుకు అర్హత సాధించింది. రేపు జరిగే ఫైనల్స్‌లో నిజామాబాద్ జట్టుతో తలపడనుంది. జట్టు విజయం పట్ల జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి అక్బర్ అలీ హర్షం వ్యక్తం చేశారు.