News April 18, 2024
మర్రిపాడు: అదుపుతప్పి కారు బోల్తా.. తప్పిన ప్రమాదం

మర్రిపాడు మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ సమీపంలో గురువారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నెల్లూరు నుంచి దేకూరుపల్లికి వెళ్తున్న ఒక కారు అదుపుతప్పి రోడ్డు పక్కన బోల్తా పడింది. ఈ ప్రమాదంలో అదృష్టవశాత్తు కారులో ఉన్నవారు ప్రమాదం నుంచి బయటపడ్డారు. ప్రమాద సమయంలో కారులో ముగ్గురు ఉన్నట్లు సమాచారం.
Similar News
News October 20, 2025
మాలేపాటి మృతిపై మంత్రి లోకేశ్ సంతాపం

APఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ మాలేపాటి సుబ్బానాయుడు మృతి పట్ల మంత్రి నారా లోకేశ్ సంతాపం తెలియజేశారు. ‘పార్టీలో అంచలంచెలుగా ఎదిగిన సుబ్బానాయుడు కావలి నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్గా పనిచేశారు. పార్టీ పటిష్టత కోసం, ప్రజల అభ్యున్నతి కోసం ఆయన విశేషంగా కృషి చేశారు. వారి మరణం పార్టీకి తీరని లోటు. సుబ్బానాయుడు ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను’. అని అన్నారు.
News October 20, 2025
కావలి: మాలేపాటి సుబ్బానాయుడు మృతి

ఏపీ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ మాలేపాటి సుబ్బానాయుడు మృతి చెందారు. బ్రెయిన్ స్టోక్తో గత 10 రోజులుగా విజయవాడలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాలేపాటి ఆదివారం రాత్రి తుది శ్వాస విడిచారు. శనివారం రాత్రి మాలేపాటి అన్న కుమారుడు బాను గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. అంతక్రియలు ఇవాళ దగదర్తిలో నిర్వహించనున్నారు. మాలేపాటి మరణ వార్తతో ఆ కుటుంబం శోకసముద్రం మునిగిపోయింది.
News October 20, 2025
భారీ వర్షాల నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాలి : కలెక్టర్

జిల్లాలో ఈశాన్య రుతు పవనాలు ప్రవేశించిన నేపథ్యంలో భారీ వర్షాలు పడుతున్నాయని, ఇంకా కొనసాగే అవకాశం ఉందని, ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ హిమాన్షు శుక్ల ఒక ప్రకటనలో సూచించారు. తీర ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలన్నారు. అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లరాదనీ, వెళ్లినా వెంటనే వచ్చేయాలని సూచించారు.