News May 25, 2024

మర్రిపూడి: ఉరి వేసుకోని వివాహిత ఆత్మహత్య

image

మర్రిపూడి మండలం పన్నూరు గ్రామంలో శుక్రవారం విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఓ వివాహిత (33) భార్యాభర్తల వివాదాల నేపథ్యంలో ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న ఎస్సై శివ బసవరాజు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఎస్సై స్థానికులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News March 14, 2026

పదవ తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి: డీఈవో రేణుక

image

పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా విద్యాధికారి రేణుక తెలిపారు. ఈనెల 16 నుంచి 28వ తేదీ వరకు ఓపెన్ స్కూల్ సొసైటీ పరీక్షలు జరుగుతాయన్నారు. రెగ్యులర్ పబ్లిక్ పరీక్షలు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు ఉంటాయన్నారు. ఆర్టీసీ బస్సుల్లో వెళ్లే విద్యార్థులు హాల్ టికెట్ చూపిస్తే ఉచితంగా ప్రయాణం చేయవచ్చన్నారు. SSC పబ్లిక్ పరీక్షల కోసం 165 సెంటర్లు కేటాయించామన్నారు.

News March 14, 2026

ఉమ్మడి ప్రకాశం: 10th విద్యార్థులకు SP సూచన

image

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఈ నెల 16 నుంచి జరిగే పదవ తరగతి పరీక్షలకు పటిష్ఠ బందోబస్తు చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. ఈ మేరకు శనివారం ఎస్పీ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. జిల్లా వ్యాప్తంగా 108 కేంద్రాల్లో 10 పరీక్షలు జరుగుతున్నాయని, పరీక్షలు సజావుగా జరిగేందుకు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఏవైనా ఘటనలు జరిగితే డయల్ 100కు సమాచారం అందించాలని ఎస్పీ కోరారు.

News March 14, 2026

ఉమ్మడి జిల్లాలో గ్యాస్ కొరత లేదు: కలెక్టర్

image

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో గ్యాస్ కొరత లేదని జిల్లా కలెక్టర్ రాజబాబు శనివారం తెలిపారు. ప్రజలంతా ప్రశాంతంగా ఉండాలని, గ్యాస్ కొరత సృష్టించినా, అక్రమ నిల్వ చేసినా కఠిన చర్యలు తప్పవని నిర్వాహకులకు హెచ్చరించారు. ప్రజలకు ఏవైనా సమస్యలు ఏర్పడితే కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ 1077 నంబర్‌కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని వినియోగదారులకు సూచించారు.