News March 19, 2024
మర్రిపూడి: రెండు బైక్‌లు ఢీ.. ఒకరు మృతి

మర్రిపూడి మండలం వెంకటక్రిష్ణాపురం వద్ద మంగళవారం రెండు బైక్‌లు ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా, మరొకరు గాయపడ్డారు. మృతుడు కొండపి గ్రామానికి చెందిన బారెడ్డి ఏడుకొండలుగా పోలీసులు గుర్తించారు. మృతుడు ప్రతి రోజూ కొండపి నుంచి ధర్మవరం గ్రామానికి వచ్చి పాల వ్యాపారం చేస్తుంటాడని సమాచారం. గాయపడిన వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News February 6, 2025
కుటుంబ కలహాలతో యువకుడి ఆత్మహత్య

చీమకుర్తి మండలం ఏలూరువారిపాలెంకి చెందిన గంగవరపు శీను(35) కుటుంబ కలహాల నేపథ్యంలో గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు. తన చావుకు కారణం భార్య జ్యోతి, అత్తమామలే కారణమని లేఖ రాసి, నా ఇద్దరూ చిన్న పిల్లలు జాగ్రత్త అంటూ చనిపోయినట్లు సమాచారం. దీంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
News February 6, 2025
మంత్రి స్వామికి 5వ ర్యాంక్

సీఎం చంద్రబాబు మంత్రులకు ర్యాంకులు ఇచ్చారు. గతేడాది జూన్ 12న మంత్రులుగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి డిసెంబర్ వరకు ఫైళ్ల క్లియరెన్స్‌లో వారి పనితీరుపై సమీక్ష నిర్వహించారు. అనంతరం సీఎం ఈ ర్యాంకులను ప్రకటించారు. ఇందులో ప్రకాశం జిల్లా మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి 5వ ర్యాంక్, బాపట్ల జిల్లా మంత్రి గొట్టిపాటి రవికుమార్ 13వ ర్యాంక్ పొందారు. పనితీరును మెరుగు పరుచుకోవాని CM సూచించారు.
News February 6, 2025
ప్రకాశం: ఒకే రోజు ముగ్గురు మృతి

ప్రకాశం జిల్లాలో బుధవారం వివిధ ఘటనలలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. పొదిలి మండలం కంబలపాడు కి చెందిన సుబ్బరత్తమ్మ పొలంలో విద్యుత్ షాక్‌కి గురై మరణించారు. దర్శి మండలానికి చెందిన నారాయణమ్మ పురుగుల మందు తాగి చికిత్స పొందుతూ మరణించారు. అలాగే వరికుంటపాడు నుంచి పామూరు వస్తున్న బాలయ్య అనే వ్యక్తి గుర్తు తెలియని వాహనం ఢీకొని మృతి చెందారు.