News February 9, 2025
మలికిపురం: అవార్డు అందుకున్న మన పల్లెటూరు చిత్రం

మలికిపురం మండలం మోరికి చెందిన గంట మధు చిత్రానికి అవార్డు లభించింది. నేటి వరకు హైదరాబాద్ JNTUలో క్రియేటివిటీ ఆర్ట్స్ అకాడమీ మాస్టర్ స్ట్రోక్-4లో 50 మంది చిత్రకారులతో ఆర్ట్‌షో నిర్వహించారు. మన పల్లెటూరు గ్రామాల్లో ఉండే అందమైన ప్రకృతిని మధు అద్భుతంగా చిత్రించారు. ఈ దృశ్యం హైదరాబాదు JNTU యూనివర్సిటీలో విశేష జనాదరణ పొందింది. JNTU ప్రొఫెసర్ ఉదయ్ కుమార్ మధును అభినందించి ఘనంగా సత్కరించారు.
Similar News
News November 17, 2025
భూ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించండి: కలెక్టర్

ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)లో వచ్చిన వినతుల పరిష్కారంలో వివిధ శాఖల అధికారులు ఏమాత్రం నిర్లక్ష్యం వహించరాదని జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా స్పష్టం చేశారు. సోమవారం నంద్యాల కలెక్టరేట్ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రజల నుంచి 140 అర్జీలు స్వీకరించారు. వీటిలో భూ సమస్యలు అధికంగా ఉన్నాయని, రెవెన్యూ అధికారులు వాటిపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ఆదేశించారు.

సౌదీ యాక్సిడెంట్.. ఆ ఇంట్లో అనాథగా మిగిలిన సిరాజ్

సౌదీలో జరిగిన యాక్సిడెంట్ ఆ కుటుంబంలో పెను విషాదాన్ని నింపింది. రాంనగర్ వాసి నసీరుద్దీన్ తన ఫ్యామిలీతో కలిసి ఉమ్రా యాత్రకు వెళ్లారు. దురదృష్టవశాత్తు వెళ్లిన 18 మంది బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఆయన కుమారుడు సిరాజ్ ఉద్దీన్ అనాథగా మిగిలాడు. ఉపాధి కోసం అమెరికా వెళ్లిన కుమారుడు నిత్యం ఫ్యామిలీతో ఫోన్ కాల్స్ మాట్లాడేవాడని తెలిసింది. ప్రమాదం తెలుసుకున్న అతడు శోకసంద్రంలో మునిగిపోయాడు.