News February 9, 2025
మలికిపురం: అవార్డు అందుకున్న మన పల్లెటూరు చిత్రం

మలికిపురం మండలం మోరికి చెందిన గంట మధు చిత్రానికి అవార్డు లభించింది. నేటి వరకు హైదరాబాద్ JNTUలో క్రియేటివిటీ ఆర్ట్స్ అకాడమీ మాస్టర్ స్ట్రోక్-4లో 50 మంది చిత్రకారులతో ఆర్ట్‌షో నిర్వహించారు. మన పల్లెటూరు గ్రామాల్లో ఉండే అందమైన ప్రకృతిని మధు అద్భుతంగా చిత్రించారు. ఈ దృశ్యం హైదరాబాదు JNTU యూనివర్సిటీలో విశేష జనాదరణ పొందింది. JNTU ప్రొఫెసర్ ఉదయ్ కుమార్ మధును అభినందించి ఘనంగా సత్కరించారు.
Similar News
News March 20, 2025
ఏలూరు జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

*ఏలూరు (M) పవర్ పేట రైలు ప్రమాదంలో ఒకరు మృతి *భీమడోలులో రైలు నుంచి జారి ఒకరు మృతి *చాట్రాయి (M) చిన్నంపేటలో ఉపాధి కూలీల ఆందోళన *జీలుగుమిల్లిలో ఫీల్డ్ అసిస్టెంట్ మృతి.. బోర్డర్ వద్ద బంధువుల ఆందోళన*జీలుగుమిల్లిలో వ్యాన్ బోల్తా*ఏలూరులో సినిమా షూటింగ్ ప్రారంభం*జంగారెడ్డిగూడెం (M) పంగిడి గూడెంలో అగ్నిప్రమాదం *చింతలపూడిలో మహిళ మృతి*టీ.నరసాపురం (M) జగ్గవరంలో గ్రావెల్ ట్రాక్టర్ బోల్తా
News March 20, 2025
ఏలూరు: 4,060,14 గృహాలకు కుళాయి కనెక్షన్: కలెక్టర్

ఏలూరు జిల్లాలో జల్ జీవన్ మిషన్ పథకం ద్వారా ఇంటింటికీ కుళాయి కనెక్షన్ అందించే కార్యక్రమంలో భాగంగా మొత్తం 4,74,978 గృహాలకుగాను, 4,060,14 గృహాలకు కుళాయి కనెక్షన్ అందించడం జరిగిందని కలెక్టర్ వెట్రిసెల్వి గురువారం తెలిపారు. మిగిలిన గృహాలకు కూడా నిర్దేశించిన సమయంలో కుళాయి కనెక్షన్లు అందించాలని అధికారులను ఆదేశించారు.
News March 20, 2025
ఏలూరు: సత్తా చాటిన ఆశ్రమం మెడికల్ కాలేజ్ విద్యార్థులు

ఏలూరు ఆశ్రమం మెడికల్ కాలేజి విద్యార్థులు 2024 సంవత్సరానికి జరిగిన యంబీబీయస్ పరీక్షా ఫలితాలలో అఖండ విజయాన్ని నమోదు చేశారు. 257 మంది విద్యార్ధులు పాల్గొన్న ఈ పరీక్షలలో 238 విద్యార్థులు ఉత్తీర్ణులైనట్లు ఆశ్రం వైద్య కళాశాల ప్రిన్సిపల్ డా.చేబ్రోలు శ్రీనివాస్ తెలిపారు. ఫైనల్ యం.బి.బి.యస్ పార్ట్-1 లో 100% శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, పార్ట్-2లో 92% శాతం ఉత్తీర్ణత నమోదు చేశారన్నారు.