News March 5, 2025

మలేరియా రహిత జిల్లా గా తీర్చిదిద్దాలి: DM&HO

image

మలేరియా రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని, సీజ‌న‌ల్‌, ఇత‌ర అంటువ్యాధులు విజృంభించ‌కుండా త‌గిన చర్య‌లు తీసుకోవాల‌ని వైద్యాధికారుల‌ను రాష్ట్ర అదనపు సంచాలకులు (మలేరియా) డాక్టర్ బి.సుబ్రహ్మణ్యేశ్వరి, DM&HO డా టివి బాల మురళీకృష్ణ పిలుపునిచ్చారు. పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, యూపీహెచ్‌సీలు, ఏరియా ఆసుప‌త్రి వైద్యాధికారుల‌తో బుధవారం తన కార్యాలయంలో సమావేశం జరిగింది. వ్యాధుల ప్రబలకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

Similar News

News February 12, 2026

నదుల అనుసంధానంతో మారనున్న సిక్కోలు ముఖ చిత్రం

image

రానున్న రోజుల్లో గోదావరి-వంశధార నదుల అనుసంధానంతో సాగు నీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం లభించడంతో సిక్కోలు ముఖచిత్రం మారనుంది. పోలవరం ప్రాజెక్ట్ ద్వారా గోదావరి జలాల అనుసంధానానికి కూటమి ప్రభుత్వం పచ్చ జెండా ఊపడంతో జిల్లా రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. ఈ ప్రక్రియ సాకారమైతే జిల్లాలో చివరి ఆయకట్టు వరకు సాగు నీరు అందుతుంది. వర్షాభావ పరిస్థితుల్లో వంశధార నది ఎండిపోకుండా గోదావరి జలాలు ఆదుకోనున్నాయి.

News February 12, 2026

నదుల అనుసంధానంతో మారనున్న సిక్కోలు ముఖ చిత్రం

image

రానున్న రోజుల్లో గోదావరి-వంశధార నదుల అనుసంధానంతో సాగు నీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం లభించడంతో సిక్కోలు ముఖంచిత్రం మారనుంది. పోలవరం ప్రాజెక్ట్ ద్వారా గోదావరి జలాల అనుసంధానానికి కూటమి ప్రభుత్వం పచ్చ జెండా ఊపడంతో జిల్లా రైతాంగంలో ఆనందం వెల్లివిరుస్తోంది. ఈ ప్రక్రియ సాకారమైతే జిల్లాలో చివరి ఆయకట్టు వరకు సాగు నీరు అందుతుంది. వర్షాభావ పరిస్థితుల్లో వంశధార నది ఎండిపోకుండా గోదావరి జలాలు ఆదుకోనున్నాయి.

News February 12, 2026

SKLM : మహిళపై దాడి.. ఒకరిపై కేసు

image

కోటబొమ్మాళి మండలం కన్నెవలస గ్రామానికి చెందిన కాళ్ల సింహాద్రమ్మ తనపై దాడి చేసి గాయపరిచారని అదే గ్రామానికి చెందిన దేవాది అప్పలమ్మ బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాగునీటి కుళాయి వద్ద నీరు పట్టుకుంటున్న సమయంలో వెనుక నుంచి వచ్చి కొట్టి గాయపరిచినట్లు ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వి. సత్యనారాయణ తెలిపారు.