News April 9, 2025
మలేరియా రోగుల పట్ల ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలి: కలెక్టర్

జిల్లాలోని మలేరియా రోగుల పట్ల ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్ వైద్యాధికారులను ఆదేశించారు. గతంలో కంటే తీవ్రంగా ప్రస్తుత మలేరియా ఉంటుందని వైద్యాధికారులు తెలిపిన నేపథ్యంలో వారికి అవసరమైన చికిత్సను అందించడంతో పాటు తగినంత నీరు, ఆహారాన్ని అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకు సంబంధిత శాఖల సహకారం తీసుకోవాలని సూచించారు. మంగళవారం సంబంధిత అధికారులతో కలెక్టరేట్లో సమీక్షించారు.
Similar News
News October 17, 2025
కంది: భారత జట్టు కబడ్డీ కోచ్‌గా శ్రీనివాస్ రెడ్డి

ఆసియా గేమ్స్‌లో పాల్గొనే భారత కబడ్డీ జట్టుకు కోచ్‌గా కంది మండలం ఉత్తర్ పల్లి గ్రామానికి చెందిన శ్రీనివాస్ రెడ్డి ఎంపికయ్యారు. ఈనెల 19 నుంచి 23వ తేదీ వరకు బెహ్రెయిన్‌లో జరిగే 3వ యూత్ ఆసియన్ గేమ్స్‌లో పాల్గొనే భారత కబడ్డీ అబ్బాయిల టీంకు కోచ్‌గా వ్యవహరిస్తారు. శ్రీనివాస్ రెడ్డి నియామకంపై తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వీరేష్, ప్రధాన కార్యదర్శి మహేందర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
News October 17, 2025
చలికాలం వచ్చేస్తోంది.. ఈ జాగ్రత్తలు మర్చిపోవద్దు!

ఈ ఏడాది సాధారణం కంటే ఎక్కువ చలి ఉండొచ్చని వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. మరింత అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. ఇలాంటి ఉష్ణోగ్రతల వల్ల శ్వాసకోస వ్యాధులు, ఫ్లూ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంటుంది. ‘చలిలో తిరగకుండా ఉంటే మంచిది. నూలు వస్త్రాలు, స్కార్ఫులు, క్యాప్, గ్లౌజులు ధరించడం మంచిది. వేడి ఆహారాన్నే తీసుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రత ఎంతో ముఖ్యం’ అని వైద్యులు సూచిస్తున్నారు.
News October 17, 2025
పోలీసుల విచారణలో నిజాలు వెలుగు చూస్తాయి: కలెక్టర్

పోలీస్ విచారణలో నిజాలు వెలుగు చూస్తాయని కలెక్టర్ కె.హైమావతి తెలిపారు. గురువారం హుస్నాబాద్ మండలం జిల్లెల్లగడ్డలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను సందర్శించి 10 రోజుల క్రితం మృతిచెందిన విద్యార్థి వివేక్ ఘటనపై సహ విద్యార్థులతో ఆరా తీశారు. ప్రిన్సిపల్‌ను సీసీ కెమెరాలు, రాత్రి విధుల్లో అధ్యాపకుల శ్రద్ధ, భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.