News April 9, 2025
మలేరియా రోగుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి: కలెక్టర్

పార్వతీపురం మన్యం జిల్లాలోని మలేరియా రోగుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ వైద్యాధికారులను ఆదేశించారు. గతంలో కంటే మలేరియా తీవ్రమయ్యే అవకాశం ఉండవచ్చని వైద్యాధికారులు తెలిపిన నేపథ్యంలో వారికి అవసరమైన చికిత్సను అందించడంతో పాటు తగినంత నీరు, ఆహారాన్ని అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకు సంబంధిత శాఖల సహకారం తీసుకోవాలని సూచించారు.
Similar News
News September 18, 2025
సిద్దిపేట: ‘2 BHK ఇళ్లకు లబ్దిదారులను ఎంపిక చేయాలి’

జిల్లాలో నివాసయోగ్యమైన రెండు పడక గదుల ఇళ్లలో ఎంపిక చేసిన లబ్ధిదారులు మాత్రమే నివాసం ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కె. హైమావతి అధికారులను ఆదేశించారు. బుధవారం ఐడీఓసీ సమావేశ మందిరంలో 2 BHK ఇళ్ల మంజూరు, లబ్ధిదారులకు ఇళ్ల అప్పగింత, ఇతర ప్రగతి పనులపై తహశీల్దార్, మున్సిపల్, హౌసింగ్ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
News September 18, 2025
iOS 26పై యూజర్ల నుంచి భిన్నాభిప్రాయాలు

ఐఫోన్ 11, ఆ తర్వాతి మోడల్స్కి iOS 26 స్టాండర్డ్ వర్షన్ అందుబాటులోకి వచ్చింది. కొందరు లిక్విడ్ గ్లాస్ న్యూ డిజైన్, యాపిల్ ఇంటెలిజెన్స్ ఇంటిగ్రేషన్, లాక్ స్క్రీన్, హోం స్క్రీన్ ఎక్స్పీరియన్స్ బాగున్నాయంటున్నారు. మరికొందరు ‘బ్యాటరీ వెంటనే డ్రెయిన్ అవుతోంది, ఫోన్ వేడెక్కుతోంది’ అని ఫిర్యాదు చేస్తున్నారు. మేజర్ అప్డేట్ ఇలాంటివి సహజమేనని త్వరలోనే అంతా సర్దుకుంటుందని యాపిల్ కంపెనీ చెబుతోంది.
News September 18, 2025
మెదక్: రాష్ట్రస్థాయి పోటీలకు జేఎంజే విద్యార్థులు

మెదక్ జిల్లా మనోహరాబాద్ జేఎంజే విద్యార్థినీలు రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల ప్రిన్సిపల్ అనిత తెలిపారు. జిల్లా స్థాయిలో జరిగిన పోటీలలో తమ పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచారని, వారిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు తెలిపారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను అభినందించారు. ఈ కార్యక్రమంలో పీఈటీ మహేశ్, కార్యదర్శి రమేశ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.