News April 1, 2024
మల్కాజిగిరిలో BRS ‘పక్కా లోకల్’ వ్యూహం
మల్కాజిగిరిలో గెలుపే లక్ష్యంగా BRS నేతలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. అయితే ప్రచారంలో ‘పక్కా లోకల్’ అనే నినాదాన్ని వారు ఎత్తుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి సునీతామహేందర్ రెడ్డి వికారాబాద్ నుంచి వచ్చారని, BJPఅభ్యర్థి ఈటల రాజేందర్ హుజూరాబాద్ నుంచి వచ్చారని కానీ BRSఅభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ‘పక్కా లోకల్’ అంటూ ప్రచారం చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్, BJP సైతం తమదైన శైలిలో ప్రచారం చేస్తున్నాయి.
Similar News
News November 13, 2024
HYD: ప్రజా కవికి 1992లోనే పద్మవిభూషణ్: KTR
ప్రజాకవి కాళోజి నారాయణరావు వర్ధంతి సందర్భంగా తెలంగాణ భవన్‌లో ఆయన చిత్రపటానికి మాజీ మంత్రి, BRS వర్కింగ్ ప్రెసిడెంట్, MLA KTR నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. 1992లో భారతదేశ రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్‌ను పొందారని కొనియాడారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు తదితరులు పాల్గొన్నారు.
News November 13, 2024
మాజీ MLA పట్నం నరేందర్ అరెస్ట్ దుర్మార్గం: హరీశ్ రావు
మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అక్రమ అరెస్టు చేయడం దుర్మార్గమని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. పాలన గాలికి వదిలి అరెస్టులు, అక్రమ కేసులు, ముందస్తు నిర్బంధాలు విధిస్తూ రాజకీయ కక్ష తీర్చుకోవడం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్ బెదిరింపులకు బీఆర్ఎస్ పార్టీ భయపడదన్నారు. పట్నం నరేందర్ రెడ్డిని, రైతులను వెంటనే విడుదల చేయాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు.
News November 13, 2024
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లో ఉద్యోగాలు
గచ్చిబౌలిలోని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (UoH) ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హతగల భారతీయ పౌరులు, భారతీయ విదేశీ పౌరులు అప్లై చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. చివరి తేదీ 9 డిసెంబర్ 2024. అప్లై చేసిన హార్డ్ కాపీ డిసెంబర్ 16 లోపు పంపించాలి. మరిన్ని వివరాలకు https://uohyd.ac.in/careers-uoh/ సందర్శించవచ్చు. SHARE IT