News February 1, 2025

మల్కాజిగిరి: అన్ని స్టేషన్లలో డిజిటల్ చెల్లింపులు!

image

మల్కాజిగిరి, మౌలాలి, చర్లపల్లి, సికింద్రాబాద్, ఘట్కేసర్ సహా అన్ని రైల్వే స్టేషన్లో డిజిటల్ చెల్లింపులు అందుబాటులో ఉన్నట్లు GM అరుణ్ కుమార్ జైన్ తెలిపారు. డిజిటల్ చెల్లింపుల కోసం ప్రత్యేకంగా UTS స్పెషల్ కౌంటర్లను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. టికెట్లు బుక్ చేసుకోవడానికి UTS యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన చెప్పుకొచ్చారు.

Similar News

News February 16, 2025

దారుణం.. భర్త ఎదుటే భార్యపై అత్యాచారం

image

TG: సంగారెడ్డి(D) ఫసల్‌వాదిలో శుక్రవారం అర్ధరాత్రి దారుణం జరిగింది. మెదక్ జిల్లా అల్లాదుర్గంలోని ఓ తండాకు చెందిన దంపతులు సేవాలాల్ జయంతి సందర్భంగా ఈ నెల 2న అనంతపురం జిల్లాకు కాలినడకన వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ఫసల్‌వాదిలోని ఓ విద్యాపీఠంలో భోజనం చేసి చెట్టు కింద నిద్రపోయారు. పెయింటింగ్ పనులు చేసే మాథవన్ (34) భర్తను ఘోరంగా కొట్టి సదరు మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడిని అరెస్టు చేశారు.

News February 16, 2025

ప్రకాశం: నిర్లక్ష్యానికి ముగ్గురు బలి

image

పల్నాడు జిల్లా నెమలిపురి దగ్గర అద్దంకి-నార్కెట్ పల్లి హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ప్రకాశం జిల్లా వాసులు మృతిచెందిన విషయం తెసిందే. హైదరాబాద్ నుంచి మద్దిపాడుకు వస్తుండగా లారీ, కారును ఢీకొట్టింది. తల్లి, ఇద్దరు కుమారులు మృతిచెందారు. ఎస్పీ శ్రీనివాసరావు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు.
ప్రమాదానికి లారీ డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు.

News February 16, 2025

రంజీ ట్రోఫీ నుంచి జైస్వాల్ ఔట్?

image

టీమ్ ఇండియా ప్లేయర్ యశస్వీ జైస్వాల్ రంజీ సెమీస్ మ్యాచ్ ఆడటం లేదని తెలుస్తోంది. కాలి మడమ నొప్పి కారణంగా ఆయన ఈ మ్యాచ్ నుంచి తప్పుకుంటున్నట్లు సమాచారం. కాగా ఈ నెల 17 నుంచి విదర్భతో జరగనున్న సెమీ ఫైనల్ కోసం ముంబై సెలక్టర్లు జైస్వాల్‌ను ఎంపిక చేశారు. ఈ క్రమంలో ఆయన గాయపడడం ముంబైకి పెద్ద ఎదురుదెబ్బగా చెప్పుకోవచ్చు. మరోవైపు ఛాంపియన్స్ ట్రోఫీలో బరిలోకి దిగే భారత జట్టులోనూ జైస్వాల్ చోటు దక్కించుకోలేదు.

error: Content is protected !!