News April 19, 2024

మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి ఈటల ఆస్తి రూ.54.01 కోట్లు

image

మల్కాజిగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌కు రూ.54.01 కోట్ల ఆస్తులు ఉన్నట్లు ఎన్నికల అధికారికి ఇచ్చిన తన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. రూ.20.43 కోట్ల అప్పులు ఉన్నాయని, తనపై 54 కేసులు ఉన్నట్లు చెప్పారు. చేతిలో రూ. లక్ష నగదు, భార్య జమునకు 1.5 కిలోల బంగారు ఆభరణాలు, వివిధ కంపెనీల్లో పెట్టబడులు ఉన్నాయన్నారు. కుటుంబానికి 72.25 ఎకరాల భూమి, పౌల్ట్రీ ఫారాలు, నివాస, వాణిజ్య భవనాలు ఉన్నాయని వెల్లడించారు.

Similar News

News September 19, 2024

HYD: నిమ్స్ వైద్యులకు ఐసీఎంఆర్ గుర్తింపు

image

కొవిడ్ సమయంలో మూడు ఏళ్ల పాటు శ్రమించి వైద్య సేవలందించిన నిమ్స్ వైద్యులకు ప్రత్యేక గుర్తింపు దక్కింది. వైద్యుల సేవలను గుర్తిస్తూ ICMR ప్రశంసా పత్రాలను అందజేసింది. వీరిలో జనరల్ మెడిసిన్ విభాగానికి చెందిన ప్రొఫెసర్లు నవాల్ చంద్ర, YSN రాజు, సుబ్బలక్ష్మి, జమునా హుస్సేన్, మైక్రోబయాలజీ విభాగానికి చెందిన ఉమాబాల, తేజా, పద్మజా, MVLN రామ్మోహన్ ఉన్నారు.

News September 19, 2024

HYDలో ఇదీ పరిస్థితి..!

image

HYDలో గణేశ్ ఉత్సవాలు మొదలయ్యాక భారీగా వ్యర్థాల సేకరణ పెరిగిందని అధికారిక గణాంకాలు వెల్లడించారు. ఆగస్టులో సగటున 7,900 మెట్రిక్ టన్నుల వ్యర్థాలు వెలువడితే, చవితి రోజు 8337.96 మె.టన్నులు సేకరించినట్లు తెలిపారు. 11తేదీన 8810.10 మె.టన్నులు, 17న 8547.58 మె.టన్నులు సేకరించారు. కాగా మంగళ, బుధవారాల్లో పోగైనది సేకరిస్తున్నారు. ఇందులో అత్యధికంగా కలర్ పేపర్లు, పూజా వ్యర్థాలే ఉన్నట్టు తెలిపారు.

News September 19, 2024

HYD: గణనాథుడిని దర్శించుకున్న KTR

image

వినాయకచవితి ఉత్సవాల్లో భాగంగా HYD కుషాయిగూడలోని TSIIC కాలనీలో BRS రాష్ట్ర నాయకుడు సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో యువసేన యూత్ అసోసియేషన్ వారు భారీ గణనాథుడిని ప్రతిష్ఠించారు. బుధవారం వినాయకుడి ప్రత్యేక పూజలో BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR, ఉప్పల్ నియోజకవర్గ MLA బండారి లక్ష్మారెడ్డి, పలువురు కార్పొరేటర్లు, BRS పార్టీ నాయకులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.