News April 19, 2024
మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి ఈటల ఆస్తి రూ.54.01 కోట్లు
మల్కాజిగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌కు రూ.54.01 కోట్ల ఆస్తులు ఉన్నట్లు ఎన్నికల అధికారికి ఇచ్చిన తన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. రూ.20.43 కోట్ల అప్పులు ఉన్నాయని, తనపై 54 కేసులు ఉన్నట్లు చెప్పారు. చేతిలో రూ. లక్ష నగదు, భార్య జమునకు 1.5 కిలోల బంగారు ఆభరణాలు, వివిధ కంపెనీల్లో పెట్టబడులు ఉన్నాయన్నారు. కుటుంబానికి 72.25 ఎకరాల భూమి, పౌల్ట్రీ ఫారాలు, నివాస, వాణిజ్య భవనాలు ఉన్నాయని వెల్లడించారు.
Similar News
News September 12, 2024
HYD: దౌర్జన్యమా, గుండాయిజమా..?: KTR
దౌర్జన్యమా, గుండాయిజమా..? ఇందులో ఏది ఇష్టమో చెప్పండి సీఎం రేవంత్ రెడ్డి, మీ కాంగ్రెస్ గుండాల బెదిరింపులకు BRS సైనికులు భయపడరని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి తామంతా అండగా నిలబడతామన్నారు. మీ అవినీతి దుష్పరిపాలన నుంచి రాష్ట్రంలోని ప్రతి అంగుళాన్ని కాపాడుకుంటామని, మీ భయానక వ్యూహాలు మా సంకల్పానికి ఆజ్యం పోస్తాయన్నారు.
News September 12, 2024
HYD: FREE వాటర్ పథకం.. ఇది మీ కోసమే!
గ్రేటర్ HYD పరిధిలో డొమెస్టిక్ యూజర్లు 20 వేల లీటర్ల ఉచిత మంచినీటి సరఫరా పథకం పొందేందుకు HMWSSB అధికారులు పలు సూచనలు చేశారు. పథకం పొందెందుకు ఆధార్ నెంబర్ CAN నంబర్‌తో లింక్ చేసుకోవడంతో పాటు, వాటర్ మీటర్ ఉండాలన్నారు. మురికివాడల్లో ఉన్న ప్రజలు కేవలం ఆధార్ లింక్ చేస్తే సరిపోతుందన్నారు. వాటర్ మీటర్ కనెక్షన్‌పై మినహాయింపు అందించినట్లు తెలిపారు. ఇందుకోసం స్థానిక సర్కిల్ కార్యాలయాన్ని సందర్శించాలన్నారు.
News September 12, 2024
గణేశ్ నిమజ్జనం: HYDలో ‘రేపటి కోసం’
వినాయకచవితి ఉత్సవాల్లో భాగంగా నిమజ్జనం కోసం హైదరాబాద్‌లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. మండపాల్లో విగ్రహాలను నిలబెట్టిన భక్తులు ‘రేపటి కోసం’ అనే నినాదంతో ముందుకు వెళ్తున్నారు. ‘నిమజ్జనం ఉంది. విరాళాలు కావాలి. సొంత డబ్బులు పోగు చేయాలి. అన్నదానం కోసం దాతల సహాయం కావాలి. మన గణపతిని అంగరంగ వైభవంగా ఊరేగించాలి’ అన్న తపనతో యువత ముందుకు కదులుతున్నారు. మరి మీ మండపం వద్ద పరిస్థితి ఎలా ఉంది. కామెంట్ చేయండి.