News June 5, 2024

మల్కాజిగిరి: కాంగ్రెస్ కొంపముంచిన అభ్యర్థుల ఎంపిక

image

అధికార కాంగ్రెస్‌ పార్టీకి లోక్‌సభ ఎన్నికల ఫలితాలు తీవ్ర నిరాశకు గురిచేశాయి. BJP చేతిలో పరాజయాన్ని చవిచూడడానికి అభ్యర్థుల ఎంపికే దీనికి ప్రధాన కారణమని విశ్లేషకులు అంటున్నారు. మల్కాజిగిరి పార్లమెంట్‌ నుంచి పోటీకి కాంగ్రెస్‌ సీనియర్లు KLRతో పాటు మరికొందరు ఆసక్తి చూపినప్పటికీ టికెట్ ఇవ్వలేదు. చేవెళ్ల నుంచి సునీతారెడ్డి పోటీ చేసి ఉంటే ఇక్కడ గెలిచే అవకాశాలు మెరుగ్గా ఉండేవని పార్టీ నాయకులు అంటున్నారు.

Similar News

News October 24, 2025

బస్సు ప్రమాదంలో.. పటాన్‌చెరు వాసులు మృతి

image

కర్నూల్ బస్సు ప్రమాదంలో తల్లి, కొడుకు మృతి చెందారు. బెంగళూరు వెళ్లేందుకు సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు కృషి డిఫెన్స్ కాలనీకి చెందిన రాము, అతని తల్లి పటాన్‌చెరులో బస్సు ఎక్కారు. దీపావళి పండుగకోసం బెంగళూరు నుంచి స్వగ్రామానికి వచ్చి తిరిగి వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. ఘటనా స్థలంలోనే ఇద్దరూ మృతి చెందడంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

News October 24, 2025

HYD: షాకింగ్.. 3 రోజుల్లో ముగ్గురు ఫ్రెండ్స్ సూసైడ్

image

అబ్దుల్లాపూర్‌మెట్(మం) కోహెడలో మూడు రోజుల్లో ముగ్గురు ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతుంది. వీళ్లు 6th-10th కలిసి చదువుకున్నారు. గ్యార వైష్ణవి(18) మంగళవారం ఉరేసుకుంది. ఆమె క్లాస్మెట్ సతాలీ రాకేశ(21) ఇంటి సమీపంలో ఓ షెటర్లో బుధవారం ఉరేసుకున్నాడు. అదే ఊరిలోని బుద్ధ శ్రీజ(18) గురువారం తెల్లవారుజామున ఇంట్లో ఉరేసుకొని కనిపించింది. దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ నాగరాజ్ గౌడ్ తెలిపారు.

News October 24, 2025

కర్నూలు బస్సు ప్రమాదం.. కూకట్‌పల్లి సూర్య సేఫ్

image

కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో కూకట్‌పల్లి మూసాపేట్ Y జంక్షన్ నుంచి బెంగళూరుకు బయలుదేరిన సూర్య (24) సేఫ్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సులో సీట్ నెంబర్ ఎల్ 16 బుక్ చేసుకుని బెంగళూరుకు బయల్దేరగా కర్నూలు వద్ద ఈ ప్రమాదం జరిగింది. బస్సు పూర్తిగా దగ్ధం కావడంతో పలువురు మృతి చెందారు. సూర్య మాత్రం సేఫ్‌గా బయటపడ్డారు. సూర్య ఫొటో Way2Newsకు అందింది.