News June 5, 2024

మల్కాజిగిరి: కాంగ్రెస్ కొంపముంచిన అభ్యర్థుల ఎంపిక

image

అధికార కాంగ్రెస్‌ పార్టీకి లోక్‌సభ ఎన్నికల ఫలితాలు తీవ్ర నిరాశకు గురిచేశాయి. BJP చేతిలో పరాజయాన్ని చవిచూడడానికి అభ్యర్థుల ఎంపికే దీనికి ప్రధాన కారణమని విశ్లేషకులు అంటున్నారు. మల్కాజిగిరి పార్లమెంట్‌ నుంచి పోటీకి కాంగ్రెస్‌ సీనియర్లు KLRతో పాటు మరికొందరు ఆసక్తి చూపినప్పటికీ టికెట్ ఇవ్వలేదు. చేవెళ్ల నుంచి సునీతారెడ్డి పోటీ చేసి ఉంటే ఇక్కడ గెలిచే అవకాశాలు మెరుగ్గా ఉండేవని పార్టీ నాయకులు అంటున్నారు.

Similar News

News December 5, 2024

HYD: పాన్ కార్డు కరెక్షన్స్.. ఇది మీ కోసమే!

image

HYD అమీర్‌పేట స్వర్ణ భారతి కాంప్లెక్స్ భవనంలో CSC హెడ్ ఆఫీసులో పాన్ కార్డు, పాస్ పోర్టు సర్వీసులు అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. పాన్ కార్డులో పేరు, DOB మార్పులు చేర్పులు కూడా చేస్తామన్నారు. మిగతా సర్వీసులు సైతం అందుబాటులో ఉన్నాయని, అవసరమైన వారు సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తున్నారు.SHARE IT

News December 5, 2024

షాకింగ్: సికింద్రాబాద్‌లో మొండెంలేని శిశువు తల

image

సికింద్రాబాద్ మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో కళ్లు చెమర్చే సంఘటన వెలుగుచూసింది. జనరల్‌బజార్‌లోని బంగారం దుకాణాల కాంప్లెక్స్ వద్ద మొండెంలేని పసికందు తల లభ్యమైంది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. కేసు నమోదు చేసిన మహంకాళి పోలీసులు CC కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News December 4, 2024

HYD: తార్నాక IICTలో ఉద్యోగాలు

image

55% మార్కులతో 10TH, ఇంటర్, ITI చేసిన అభ్యర్థులకు శుభవార్త. HYD తార్నాకలోని CSIR-ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ(IICT) టెక్నీషియన్‌ విభాగంలో 29 ఖాళీలు ఉన్నాయి. భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. రూ. 500 చెల్లించి అప్లై చేసుకోవచ్చు. SC, ST, మహిళా అభ్యర్థులు ఫీజు లేకుండానే అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తుకు చివరి తేదీ: 26-12-2024.
SHARE IT