News April 6, 2024
మల్కాజిగిరి పార్లమెంట్లో సమన్వయకర్తలు వీరే!

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోని BRS పార్టీ అసెంబ్లీ స్థానాల వారీగా ఎన్నికల సమన్వయకర్తలను నియమించింది. మేడ్చల్-శంభీపూర్ రాజు(MLC), మల్కాజిగిరి-నందికంటి శ్రీధర్, కుత్బుల్లాపూర్-గొట్టిముక్కల వెంగళరావు ,కూకట్పల్లి-బేతిరెడ్డి సుభాష్ రెడ్డి, ఉప్పల్-జహంగీర్ పాషా, సికింద్రాబాద్ కంటోన్మెంట్ -రావుల శ్రీధర్ రెడ్డి, ఎల్బీనగర్ -బొగ్గరపు దయానంద గుప్త ఎమ్మెల్సీని నియమించారు.
Similar News
News September 19, 2025
వారంలో మూడు రోజులు ముచ్చింతల్‌కు బస్సులు

ఆధ్యాత్మిక కేంద్రం ముచ్చింతల్‌కు వెళ్లేందుకు ఆర్టీసీ అధికారులు బస్సులు ఏర్పాటు చేశారు. ఈ నెల 20 నుంచి శుక్ర, శని, ఆదివారాల్లో బస్సులు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. JBS, ఆఫ్జల్‌గంజ్, సికింద్రాబాద్, KPHB, ఉప్పల్, రిసాలాబజార్ ప్రాంతాల నుంచి బస్సులు నడుపుతామన్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో ఈ సౌకర్యం ఉంటుందని వివరించారు.
News September 19, 2025
కోకాపేట్లో భర్తను చంపిన భార్య

కోకాపేట్లో భర్తను భార్య హత్య చేసిన ఘటన కలకలం రేపింది. పోలీసుల ప్రకారం.. గురువారం రాత్రి భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో భర్తపై భార్య కత్తితో దాడి చేసింది. ఇంట్లో నుంచి కేకలు రావడంతో స్థానికులు అక్కడికి వచ్చారు. రక్తపు మడుగులో పడి ఉన్న భర్తను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు. వారిని అస్సాంకి చెందిన వారిగా గుర్తించారు. భార్యాభర్తల మధ్య విభేదాలే ఈ దారుణానికి దారితీసింది.
News September 19, 2025
HYD: పూల వర్షం.. బతుకమ్మకు సరికొత్త అందం!

తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను ఈసారి అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. పర్యాటకశాఖ ఆధ్వర్యంలో భాగ్యనగర వీధులు పూల పండుగ శోభతో ముస్తాబవ్వనున్నాయి. తెలంగాణలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా బతుకమ్మ ఘనత చాటి చెప్పేలా బహుముఖ ప్రణాళికలు రూపొందాయి. ఊహకందని ఏర్పాట్లులతో ఈ వేడుకలు భాగ్యనగరానికి కొత్త ఉత్సాహాన్ని తీసుకురానున్నాయి.